పేరుకే ‘మిడిల్ క్లాస్’.... కలెక్షన్లు మాత్రం అలా లేవు!
Recommended Video

నాని హీరోగా తెరకెక్కిన 'ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీ గురువారం విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వరుసగా హాట్రిక్స్ కొడుతున్న నాని ఈ సినిమాతో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా పేరుకే 'మిడిల్ క్లాస్ '.... కానీ కలెక్షన్స్ చూస్తే మాత్రం హైక్లాస్‌గా ఉన్నాయని ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. తొలి రోజు ఈ చిత్రం ఊహించిన దానికంటే భారీ వసూళ్లు సాధించడమే ఇందుకు కారణం.

నాని కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్
‘ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయి' చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్ రూ. 15 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. నాని కెరీర్లోనే రికార్డు స్థాయి కలెక్షన్ ఇది. ప్రతి సినిమాకు నాని మార్కెట్ స్థాయి పెరుగుతుంది అనడానికి ఈ కలెక్షన్సే నిదర్శనం.

గత సినిమాతో పోలిస్తే...
ఏంసీఏ మూవీ తొలి రోజు రూ. 15 కోట్ల గ్రాస్ సాధించగా, అందులో దాదాపు రూ. 10 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చిందని అంటున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.71 షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. నాని గత సినిమా అత్యధికంగా తొలి రోజు రూ. 4.60 కోట్ల షేర్ రాబట్టింది.

నైజాం ఏరియాలో హయ్యెస్ట్ షేర్
‘ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాకు నిర్మాత దిల్ రాజు. నైజాం ఏరియాలో ఆయన తిరుగులేని డిస్ట్రిబ్యూటర్. ఈ చిత్రాన్ని ఇక్కడ గ్రాండ్ గా విడుదల చేశారు. తొలి రోజు ఈ చిత్రం ఇక్కడ రూ. 3.09 కోట్ల షేర్ రాబట్టింది.

సీడెడ్‌లోనూ అదుర్స్
సీడెడ్ ఏరియాలో కూడా ‘ఎంసీఏ' మూవీ కలెక్షన్ల పరంగా దుమ్ము రేపింది. ఈ చిత్రం ఇక్కడ తొలి రోజు రూ. 1.30 కోట్లు వసూలు చేసింది. ఏరియా వైజ్ తీసుకున్నా నాని కెరీర్లో ఇది హయ్యెస్ట్ కలెక్షన్.

ఆంధ్రా ప్రాంతంలో
ఆంధ్రా ప్రాంతంలో కలెక్షన్స్ పరిశీలిస్తే.... నెల్లూరులో రూ. 20.4 లక్షలు, గుంటూరులో రూ. 68.6 లక్షలు, కృష్ణాలో రూ. 46.7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 45 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 56.4 లక్షల షేర్ వసూలు చేసింది.

ఉత్తరాంధ్రలో
ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ‘ఏంసీఏ' కలెక్షన్స్ ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చాయి. ఈ చిత్రం తొలి రోజు ఇక్కడ రూ. 93.3 కోట్ల షేర్ వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో
ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.71 కోట్ల షేర్ (రూ. 11 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ద్వారా $300k వసూలైంది. అంతా కలుపుకుంటే వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 15 కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications











