చిన్న సినిమా బిగ్ హిట్.. షాకింగ్‌గా మీకు మాత్రమే చెప్తా.. విజయ్ దేవరకొండ అఫీషియల్‌గా

సూపర్ పవర్ స్టార్ విజయదేవరకొండ నిర్మాతగా మారి దర్శకుడు తరుణ్ భాస్కర్, కమెడియన్ అభినవ్ గోమఠం, అనసూయ తదితర నటుల కలయికతో రూపొందించిన మీకు మాత్రమే చెప్తా చిత్రం చిన్న చిత్రంగా వచ్చి కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకొన్నది. తాజాగా సక్సెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ తన తొలి సినిమాపై సంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా.. సంతోషాన్ని వ్యక్తం చేశారు. తొలివారాంతంలోనే సినిమా డిస్టిబ్యూటర్లను లాభాల పట్టించదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో

చిన్న తరహా బడ్జెట్‌తో రూపొందిన మీకు మాత్రమే చెప్తా తొలి వారాంతంలో తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను నమోదు చేసింది. నైజాంలో రూ.2.25 కోట్లు వసూలు చేయగా, ఆంధ్రాలో సుమారు రూ.కోటికిపైగా రాబట్టింది. ఇక ఉత్తరాంధ్రలో మూడు రోజుల్లోనే 27 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సీడెడ్ విషయానికి వస్తే రూ.17 లక్షలు వసూలు చేసింది.

ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో హంగామా

ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో హంగామా

ఇక సినిమా సక్సెస్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వారాంతంలో సంతృప్తికరమైన వసూళ్లను రాబట్టింది. మూడు రోజుల్లో భారీ చిత్రాలతో పోటి పడుతూ రూ.10 లక్షలకుపైగా కలెక్ట్ చేసింది. ఖైదీ, విజిల్ లాంటి చిత్రాలను ఎదురించి వసూళ్ల పరంగా నిలకడగా ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో

రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో

ఇక మిగితా రాష్ట్రాల విషయానికి వస్తే.. మోస్తారు కలెక్షన్లు నమోదు చేసింది. కర్ణాటక, తమిళనాడులో లెక్కలు చూస్తే రూ.40 లక్షల వరకు వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. వారాంతం వరకు A$10,250 కలెక్ట్ చేసింది.

థ్యాంక్స్ చెప్పిన చిత్ర యూనిట్

ఇక మీకు మాత్రమే చెప్తా అధికారికంగా మూడు రోజుల కలెక్షన్లను విడుదల చేసింది. చిన్న చిత్రం పెద్ద హిట్ సాధించింది. మీకు మాత్రమే చెప్తా చిత్రం తొలివారాంతంలో రూ.4.05 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ థ్యాంక్స్ చెబుతున్నది అని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X