twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పట్లో బళ్ళు కట్టుకొచ్చేవాళ్ళు .. ఇప్పుడు బస్సులేసుకొస్తున్నారు మెగాస్టార్ స్టామినా అంటే ఇదే

    |

    ఒకప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అయితే ఎలా ఉండేదో.. ఇప్పటి తరానికి తెలీకపోవచ్చు. చిరు సినిమాను.. థియేటర్లో ఆడిస్తే.. అక్కడి సైకిల్ పార్కింగ్ ఓనర్లు కూడా ఎంతో వైభవంగా బతికిన రోజులున్నాయని ఎంతో మంది చెప్పుకుంటారు. అలా చిరు సినిమా వస్తోందంటే.. ఎంతో మంది ఆనందంగా ఎదురుచూసేవారు.

    అయితే రాజకీయాల్లోకి వెళ్లి కాస్త గ్యాప్ ఇచ్చిన చిరు.. ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చి తన ఇమేజ్ చెక్కు చెదరలేదని నిరూపించాడు. ఈ సినిమా 150 కోట్లను కొల్లగొట్టి.. ఎప్పిటికి మెగాస్టార్ నెం.1 అని అందరికీ మరోసారి గుర్తు చేసింది. అయితే మళ్లీ చిరును వెండితెరపై చూడటానికి దాదాపు మూడేళ్లు ఆగాల్సి వచ్చింది.

     Mega Fans Came With Two Busses To See Sye Raa Movie

    తొలి స్వతంత్ర్య సమరయోధుడి కథతో తెరకెక్కిన సైరా లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా తిరుగులేని నటనను ప్రదర్శించి.. అభిమానులను అలరించాడు. అయితే చిరు సినిమాలను చూడటానికి ఒకప్పుడు బళ్లు కట్టుకొచ్చేవారు.. అయితే ఇప్పుడు బస్సులేసుకొస్తున్నారని మెగా ఫ్యాన్, నిర్మాత ఎస్ కే ఎన్ ట్వీట్ చేశాడు. సూళ్లూరు పేటలో మెగా ఫ్యాన్స్ రెండు బస్సులేసుకొని వచ్చి సినిమాను వీక్షించారని, ట్రెండ్ మారింది కానీ మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మారలేదంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, జగపతి బాబు, లేడీ సూపర్ స్టార్ నయన తార, మిల్కీ బ్యూటీ తమన్నా లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన సైరా అక్టోబర్ 2న విడుదలైన ఘన విజయం సాధించింది.

    English summary
    Mega Fans In Sullurpet, Came With Two Busses To See Sye Raa Movie. A Mega Fan and Producer SKN Tweet On That Craze About Chiranjeevi And Sye Raa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X