Just In
- 5 hrs ago
యంగ్ హీరోయిన్‌కు పెళ్లి.. మా ఆయన గొప్ప ప్రేమికుడంటూ పోస్ట్
- 6 hrs ago
గొల్లపూడి మరణం : ఆయన రాసిన ఆ నాటిక ఇష్టం.. సినీ పరిశ్రమకు తీరని లోటు.. కోట శ్రీనివాస్ కామెంట్స్
- 7 hrs ago
గొల్లపూడి మరణం : మాది గురుశిష్యుల సంబంధం.. ఆయన ద్వారానే ఆ అవకాశం.. చిరంజీవి స్పందన
- 8 hrs ago
‘సైరా’ సంచలనం: రికార్డ్ క్రియేట్ చేసిన చిరంజీవి సినిమా.. టాలీవుడ్లో ఫస్ట్ మూవీ ఇదే.!
Don't Miss!
- News
జర్మనీ యూనివర్శిటీలో కేరళ విద్యార్థిని: అనుమానస్పద స్థితిలో..చివరి ఫోన్ కాల్.. !
- Finance
నవంబర్ నెలలో 3 ఏళ్ల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం
- Technology
రెడ్మి కె30 4జీ vs రెడ్మి కె20, ఫీచర్లపై ఓ లుక్కేయండి
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Lifestyle
ఓ అందమైన వెన్నెల పున్నమి రాత్రి వేళ ఆమె గురించే ఆలోచిస్తున్న అతనికి ఓ అద్భుతం జరిగింది... అదేంటంటే..
- Sports
లాలిగా బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్: తొలి నాన్ పుట్బాలర్గా అరుదైన ఘనత
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
సైరా లెక్కలు వేయడం సాధ్యమేనా.. ఈజీగా ఐదు వందల కోట్లు.. వైరల్ అవుతున్న న్యూస్
మెగాస్టార్ చిరంజీవి రేనాటి వీరుడైన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రను పోషిస్తున్న సైరా చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. అత్యంత భారీ ఎత్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించగా.. ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానుంది.
సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన చిత్రయూనిట్.. సినిమాను ప్రమోట్ చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైంది. అన్ని ఇండస్ట్రీలకు చెందిన మహామహులు నటించడంతో.. అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని చాలా పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు కళ్లన్నీ ఈ మూవీ సాధించబోయే రికార్డులపై పడ్డాయి. దాదాపు 300కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ అవలీలగా ఆ మొత్తాన్ని రికవరీ చేస్తుందని అభిమానులు ధైర్యంగా చెబుతున్నారు.

మూవీ క్రిటిక్ అయిన కత్తి మషేష్.. ఈ మూవీ ఐదు వందల కోట్ల షేర్‌ను సాధిస్తుందని, ఇది మెగాస్టార్ చిరంజీవి సత్తా అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి దీనికి తగ్గట్టే.. ఫస్ట్ డే కలెక్షన్లు, హిందీలో కొల్లగొట్టబోయే కలెక్షన్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వసూళ్లపై అభిమానులు ఇప్పటికే చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే బుకింగ్స్ చూస్తుంటే.. దాదాపు అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నట్లు ట్రెండ్ అవుతోంది. దసరా సెలవులు కావడంతో.. ఇక కలెక్షన్లలో సరికొత్త రికార్డులు రావడం ఖాయమని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సైరా చేసే యుద్దంతో బాక్సాఫీస్ షేక్ కావాల్సిందేనని వీరాభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా లాంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించారు.