ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్.. మైండ్ బ్లాక్ చేస్తున్న మెగాస్టార్ మార్కెట్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏమిటో ఇటీవల వచ్చిన ఆచార్య టీజర్ తో మరోసారి చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. బాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా రికార్డులు ఒక రేంజ్ లో బ్రేక్ అవ్వాల్సిందే. ఇక ఆచార్య సినిమా మొత్తానికి మే 13న రాబోతున్నట్లు టీజర్ తోనే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే హాట్ టాపిక్ గా మారింది. చూస్తుంటే బాస్ న్యూ రికార్డ్స్ క్రియేట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది.

మొదలైన బిజినెస్..

మొదలైన బిజినెస్..


మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రోజులు గడుస్తున్నా కొద్దీ సినిమాపై అంచనాలు అకాశాన్ని తాకుతున్నాయి. ఇక మేలో రానున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ పనులను మొదలు పెట్టారు నిర్మాతలు.

చరణ్ పాత్రపై భారీ అంచనాలు

చరణ్ పాత్రపై భారీ అంచనాలు

ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్దా అనే పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. టీజర్ లో కేవలం చరణ్ వాయిస్ మాత్రమే వచ్చింది. ఇక ఆ పాత్రకు . అందుకు సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ ను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. రామ్ చరణ్ లుక్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన సిద్దా లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మైండ్ బ్లోయింగ్..

మైండ్ బ్లోయింగ్..

ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఆంద్రప్రదేశ్ మొత్తంగా 60కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు సమాచారం. ఇక నైజాంలో అత్యదిక మార్కెట్ ఉన్న హీరోల్లో మెగాస్టార్ ఒకరు. ఇక్కడ 35కోట్లకు పైగా బిజినెస్ చేయనున్నట్లు సమాచారం. సీడెడ్ లో కూడా మెగాస్టార్ మరోసారి తన సత్తా చాటేలా ఉన్నారు. ఈ ఏరియాలో సినిమా రైట్స్ 17కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.

Recommended Video

Acharya Teaser : Megastar Chiranjeevi Magic All Over | Acharya Movie Release Date
తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్..

తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్..


మొత్తంగా ఆచార్య సినిమా తెలుగు రాష్ట్రాల్లో 112కోట్ల నుంచి 115కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓవర్సీస్ కర్ణాటక వంటి ఏరియాల్లో కూడా ఇంకా బిజినెస్ డీల్స్ క్లోజ్ అవ్వలేదు. నిర్మాతలు అదే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ తోనే ఇటీవల బిజినెస్ డీల్స్ కు డిమాండ్ పెరిగినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X