Megastar Chiranjeevi: పెరుగుతున్న భోళా శంకర్ డిమాండ్.. నిర్మాతకు ఆడిరిపోయే డీల్
మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఆయన సినిమా వస్తుంది అంటే కచ్చితంగా బయ్యర్లకి పండగే అని చెప్పాలి. మినిమం బాగుందనే టాక్ వచ్చిన కూడా డిస్టిబ్యూటర్స్ కి సినిమాలు లాభాలు తెచ్చి పెడతాయి. సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చిన వాల్తేర్ వీరయ్య ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే.
రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ కి వచ్చిన అతి పెద్ద బ్లాక్ బస్టర్ వాల్తేర్ వీరయ్య. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగష్టు 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇక ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్రలో కనిపించబోతోంది. తాజాగా భోళా మానియా అనే సాంగ్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. ఈ సాంగ్ కి మంచి స్పందన వస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి అప్పుడే బిజినెస్ స్టార్ట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక భోళా శంకర్ ఆంధ్రా రైట్స్ ఏకంగా 45 కోట్లు పలికాయంట. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. వాల్తేర్ వీరయ్య లాంటి సక్సెస్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో భోళా శంకర్ రైట్స్ కోసం డిస్టిబ్యూటర్స్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రా రిలీజ్ రైట్స్ ని ని ప్రముఖ డిస్టిబ్యూటర్ సొంతం చేసుకున్నాడంట.
ఒక్క ఆంధ్రాలోనే 45 కోట్ల బిజినెస్ జరిగితే నైజాం, సీడెడ్, ఓవర్సీస్ కలుపుకొని ఈజీగా వంద కోట్లకి పైనే వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కూడా మరోసారి 200 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించడం పక్కా అనే మాట వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











