God Father: హిందీలో మెగాస్టార్ సినిమాకు మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఆచార్యకు సరైన రివెంజ్?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో ఊహించనివిధంగా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే తదుపరి సినిమాతో మాత్రం ఎలాగైనా మంచి విషయాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే అందరి ఫోకస్ కూడా ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా పైనే ఉంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ద్వారా నిర్మాతలకు హిందీ డబ్బింగ్ రూపంలో భారీ అమౌంట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ డిజాస్టర్
ఆచార్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ సినిమా దాదాపు 70 కోట్లకుపైగా నష్టాలను మిగిల్చింది. ఒక విధంగా మెగాస్టార్ కెరీర్లోనే అత్యంత ఎక్కువ నష్టాలను కలగించిన సినిమాగా ఆచార్య దారుణమైన రికార్డును సొంతం చేసుకుంది. ఇక సినిమా ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు మెగాస్టార్ సెటిల్మెంట్స్ చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరైన రివెంజ్ తీర్చుకోవాలి అని తదుపరి సినిమాలతో మెగాస్టార్ సిద్ధమవుతున్నారు.

మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా
తమిళ టాలెంటెడ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళం హిట్ మూవీ లుసిఫర్ కు రీమేక్ గా కాబోతోంది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా మెగాస్టార్ చిరంజీవి స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా డిఫరెంట్ గా తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

హిందీ మార్కెట్ లో భారీ ఆఫర్
ఒక విధంగా ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ తదుపరి సినిమాల మార్కెట్ పై ప్రభావం పడుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ మెగా స్టార్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు అని ఇటీవల గాడ్ ఫాదర్ కు వచ్చిన ఒక ఆఫర్ ద్వారా అర్ధం అవుతోంది. గాడ్ ఫాదర్ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రల్లో నటిస్తుండటంతో హిందీ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది.

విడుదలకు ముందే..
ఇక రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ డిజిటల్ శాటిలైట్ హక్కులు రూపంలో దాదాపు 45 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. విడుదలకు ముందే సినిమా స్థాయిలో బిజినెస్ చేసింది అంటే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు.

త్వరలోనే టీజర్?
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం దర్శకుడు మోహన్ రాజా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఈ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ను కూడా త్వరలోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా సెట్స్ పైకి వచ్చి చాలా కాలమైంది కాబట్టి అభిమానులకు మంచి కిక్ ఇచ్చే టీజర్ వదలాలి అని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











