GodFather Pre Release bussiness: మెగాస్టార్ కెరీర్ లో మరో పవర్ఫుల్ టార్గెట్.. కలెక్షన్స్ ఎంత రావాలంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా ఈసారి మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సక్సెస్ అందుకుంటారు అని ట్రైలర్తోనే క్లారిటీ వచ్చేసింది. మెగాస్టార్ మాస్ యాక్షన్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఉండడం భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత బిజినెస్ చేసిందో అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాలలోకి వెళితే..

 మెగా కాంబినేషన్

మెగా కాంబినేషన్

గాడ్ ఫాదర్ సినిమా మొదటి నుంచి కూడా మెగా అభిమానుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ పవర్ఫుల్ లుక్ కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. దానికి తోడు సల్మాన్ ఖాన్ కూడా యాక్షన్ పాత్రలో కనిపిస్తూ ఉండడంతో అటు హిందీలో కూడా ఈ సినిమాపై కొంత పాజిటివ్ హైప్ అయితే క్రియేట్ చేసింది. ఇక బిజినెస్ లో మరోసారి మెగాస్టార్ తన సత్తా చాటుకున్నారు.

రీమేక్ అయినప్పటికీ..

రీమేక్ అయినప్పటికీ..

మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళం మూవీ లూసిఫర్ సినిమా ఆధారంగా రూపొందించారు. అసలైతే ఈ సినిమా రీమేక్ అన్నట్లుగా లేదు అనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. తప్పకుండా మెగాస్టార్ తనదైన శైలిలో డిఫరెంట్ గా ఆకట్టుకుంటాడు అని ఫ్యాన్స్ అయితే చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ముఖ్యంగా టీజర్ ట్రైలర్ కూడా ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.

తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో

గాడ్ ఫాదర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే నైజాంలో ఈ సినిమా 22 కోట్ల వరకు బిజినెస్ చేయగా సిడెట్లో 13.5 కోట్ల వరకు అమ్మినట్లు తెలుస్తోంది. ఆంధ్ర మొత్తంగా 35 కోట్ల వరకు బిజినెస్ చేసిన గాడ్ ఫాదర్ సినిమా టోటల్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రికార్డు స్థాయిలో 70.50 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా

ప్రపంచవ్యాప్తంగా

ఇక కేవలం మెగాస్టార్ చిరంజీవికి తెలుగులో మాత్రమే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఇక కర్ణాటకలో అయితే ఈ సినిమా 6.50 కోట్ల మేరకు ధర పలికినట్లు సమాచారం. ఇక హిందీలో కూడా దాదాపు 6.50 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో అయితే 7.5 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే గాడ్ ఫాదర్ సినిమా 90 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.

బ్రేక్ ఈవెన్ టార్గెట్

బ్రేక్ ఈవెన్ టార్గెట్

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 91 కోట్ల బిజినెస్ చేయడంతో ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం 92 కోట్లు అందుకుంటే సక్సెస్ అయినట్లు లెక్క. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా భారీ స్థాయిలో అమ్ముడుపోతున్నట్లుగా తెలుస్తోంది. తప్పకుండా మొదటి రోజు మెగాస్టార్ చిరంజీవి రికార్డు స్థాయిలో ఒపెనింగ్స్ అందుకుంటాడని కూడా చెబుతున్నారు. మరి ఈ సినిమా 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X