Waltair Veerayya 17 Days Collections: ఈ ఆదివారం కూడా కలిసొచ్చింది.. ఈ రికార్డ్ ఊహించలేదు బాస్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుంది అని ఎవరు కూడా ఊహించలేదు విడుదలకు ముందే కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా మెగాస్టార్ పక్కా కమర్షియల్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో మరోసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ తో అర్థమయింది ఇక ఈ సినిమా నెగిటివ్ కామెంట్స్కు కౌంటర్గా ఇప్పుడు రికార్డులను క్రియేట్ చేస్తోంది 17వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ అందుకోవడం విశేషం ఇక మొత్తంగా ఈ సినిమా ఇంతవరకు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

వాల్తేరు వీరయ్య బిజినెస్ ఎంత?
బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ నటించడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక అందుకు తగ్గ బిజినెస్ క్రియేట్ అయ్యింది. సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 72 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ లో 9 కోట్ల వరకు ధర పలికింది. మొత్తంగా వరల్డ్ వైడ్ ఈ సినిమా 88 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక వాల్తేరు వీరయ్య 89 బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యింది.

17వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని కలెక్షన్స్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఇప్పటివరకు వాల్తేరు వీరయ్య బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఒకటిగా వాల్తేరు వీరయ్య నిలిచింది. ఇక 17వ రోజు మరో ఆదివారం ఈ సినిమాకు మరింత హెల్ప్ అయ్యింది. ఏపీ తెలంగాణలో ఈ సినిమా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజంలో 85 లక్షలు, సీడెడ్ లో 32 లక్షలు, ఉత్తరాంధ్ర 43 లక్షలు, ఈస్ట్ లో 24 లక్షలు, వెస్ట్ లో 17 లక్షలు, గుంటూరులో 9 లక్షలు, కృష్ణ 12 లక్షలు, నెల్లూరులో 12 లక్షలు, షేర్ కలక్షన్స్ సొంతం చేసుకుంది. ఏపీ తెలంగాణలో మొత్తంగా ఈ సినిమా 17వ రోజు 1.40 కోట్ల షేర్ కలెక్షన్స్ 3.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

17 రోజుల నైజాం, ఏపి కలెక్షన్స్
మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా 17 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏరియాల వారిగా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజంలో 34.21 కోట్లు, సీడెడ్ లో 17.36 కోట్లు, ఉత్తరాంధ్రలో 18.40 కోట్లు, ఈస్ట్ లో 10.64 కోట్లు, వెస్ట్ లో 5.92 కోట్లు, గుంటూరులో 7.58 కోట్లు, కృష్ణ లో 7.37 కోట్లు, నెల్లూరులో 4.35 కోట్లు, ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 97.93 షేర్ కలెక్షన్స్ 171.93 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్
వాల్తేరు వీరయ్య సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా ఏరియాల్లో కూడా మంచి వసూళ్ళను అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా వాల్తేరు వీరయ్య సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. అక్కడ 7.82 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో కూడా ఈసారి చిరంజీవి తన దూకుడు చూపించారు. అక్కడ 12.81 కోట్ల షేర్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా వాల్తేరు వీరయ్య సినిమా చాలా వేగంగా 127 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఇక ఈ సినిమాకు 217.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

వీరయ్యకు వచ్చిన ప్రాఫిట్స్ ఎంత?
వాల్తేరు వీరయ్య సినిమా వరల్డ్ వైడ్ గా 88 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా 89 కోట్లు అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. ఇక అలాంటిది ఇప్పుడు ఈ సినిమా మొత్తంగా షేర్ కలెక్షన్స్ 127 కోట్లు దాటడంతో ఇప్పుడు 38 కోట్ల రేంజ్ లో షేర్ ప్రాఫిట్స్ తో కొనసాగుతోంది. ఇదే ఇదే తరహాలో కొనసాగితే వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరింత లాభాలు అందుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











