Waltair Veerayya 24 Days Collections: మరో ఆదివారాన్ని క్యాష్ చేసుకున్న వీరయ్య.. ఈ లెక్కతో లాభాలు ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా గత నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించారు. అసలు సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుంది అని ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే విడుదలకు ముందే కొంత నెగిటివ్ టాక్ వచ్చింది.
పక్కా కమర్షియల్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో మరోసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ తో అర్థమయింది. ఇక 24వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ అందుకుంది. ఇక మొత్తంగా ఈ సినిమా ఇంతవరకు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది... అనే వివరాల్లోకి వెళితే..

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క?
మాస్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ నటించడం వలన కూడా మంచి హైప్ తీలుకొచ్చింది. ఇక వీరి రేంజ్ కు తగ్గ బిజినెస్ క్రియేట్ అయ్యింది. వాల్తేరు వీరయ్య సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 72 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఓవర్సీస్ లో 9 కోట్ల వరకు ధర పలికింది.టోటల్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 88 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఫైనల్ గా వాల్తేరు వీరయ్య 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యింది.

24వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని కలెక్షన్స్
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ అనంతరం పూర్తి స్థాయిలో కమర్షియల్ సినిమాతో సంక్రాంతి బరిలో సక్సెస్ అందుకోవాలని అనుకున్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే సినిమా సంక్రాంతి ఫైట్ లో మంచి టాక్ సొంతం చేసుకుంది.
చిరు కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. వాల్తేరు వీరయ్య నిలిచింది శనివారం అంటే 23వ రోజు 14 లక్షల షేర్ అందుకోగా ఆదివారం అంటే 24వ రోజు ఏకంగా 65 లక్షల షేర్ అందుకుంది.

24 రోజుల నైజాం, ఏపి కలెక్షన్స్
వాల్తేరు వీరయ్య సినిమా 24 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏరియాల వారిగా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజంలో 35.82 కోట్లు, సీడెడ్ లో 18.09 కోట్లు, ఉత్తరాంధ్రలో 19.09 కోట్లు, ఈస్ట్ లో 12.90 కోట్లు, వెస్ట్ లో 7.18 కోట్లు, గుంటూరులో 9.11 కోట్లు, కృష్ణ లో 7.66 కోట్లు, నెల్లూరులో 4.57 కోట్లు, ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 114.39 షేర్ కలెక్షన్స్ 185.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

వరల్డ్ వైడ్ మొత్తం కలెక్షన్స్
వాల్తేరు వీరయ్య ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా ఏరియాల్లో కూడా మంచి వసూళ్ళను అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా వాల్తేరు వీరయ్య సినిమాకు 8.13 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి తన దూకుడు చూపించారు.
అక్కడ 13.25 కోట్ల షేర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య సినిమా చాలా వేగంగా 135.77 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఇక ఈ సినిమాకు 231.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

వాల్తేరు వీరయ్యకు మొత్తం లాభాలు
వాల్తేరు వీరయ్య సినిమా ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. 89 కోట్లకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమా మొత్తంగా షేర్ కలెక్షన్స్ 135.77 కోట్లు దాటడంతో ఇప్పుడు 36 కోట్ల రేంజ్ లో షేర్ ప్రాఫిట్స్ తో కొనసాగుతోంది. ఇదే ఇదే తరహాలో కొనసాగితే వాల్తేరు వీరయ్య మరికొన్ని రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్ల షేర్ అందుకొని మరో రికార్డును అందుకునే ఛాన్స్ ఉంటుంది.


Click it and Unblock the Notifications











