Top Gross Movies: మెగాస్టార్ కు మరో గోల్డెన్ ఛాన్స్.. ఈ వీకెండ్ లో అల్లుడి రికార్డ్ బ్రేక్ చేసేందుకు టార్గెట్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు దాదాపు అందరూ స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. కంటెంట్ ఏ మాత్రం క్లిక్ అయినా కూడా కమర్షియల్ సినిమాలు రాజమౌళి సినిమాల తరహాలో సక్సెస్ అవుతున్నాయి. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ వీకెండ్ లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తే గనుక టాప్ 3 లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల వివరాల్లోకి వెళితే..

మొదటి స్థానంలో RRR
ముందుగా అందరి కంటే ఎక్కువ స్థాయిలో రాజమౌళి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక గత ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 415 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఇప్పటివరకు అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాల్లో కూడా ఒకటిగా RRR నిలిచింది

బాహుబలి రికార్డులు
ఇక రెండవ స్థానంలో కూడా రాజమౌళి బాహుబలి 2 సినిమా కొనసాగుతోంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ నైజాం ఏరియాలో మొత్తంగా 330 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. అంతకుముందు బాహుబలి మొదటి భాగం 175 కోట్లు అందుకోగా బాహుబలి సెకండ్ పార్ట్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువ స్థాయిలో గ్రాస్ కలెక్షన్స్ అందుకొని మార్కెట్ వాల్యూని పెంచింది.

అల్లు అర్జున్ బిగ్గెస్ట్ రికార్డ్
రాజమౌళి సినిమాల తర్వాత మొదటిసారి త్రివిక్రమ్ సినిమా ఊహించని విధంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం. కేవలం తెలుగులోనే విడుదలైన అల.. వైకుంఠపురంలములో సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో కూడా అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమా గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల్లో 203 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

వాల్తేరు వీరయ్య గ్రాస్ ఎంత
అయితే ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా ఈ రికార్డులను ఎంతవరకు బ్రేక్ చేస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మెగాస్టార్ సినిమా టాప్ 5 గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక మొత్తంగా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే వాల్తేరు వీరయ్య సినిమా 186.65 కోట్ల క్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

టాప్ ప్లేస్ లో మెగాస్టార్
ఇక ఈ వీకెండ్ అయితే వాల్తేరు వీరయ్య కు మరింత హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శివరాత్రి కూడా రాబోతోంది. అందులోనూ శనివారం ఆదివారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ వీకెండ్ లో సినిమా కలెక్షన్స్ పెరిగితే మాత్రం ఈజీగా మెగా మేనల్లుడు అల్లు అర్జున్ సినిమా అల..వైకుంఠపురములో గ్రాస్ రికార్డును బ్రేక్ చేస్తుంది అని చెప్పవచ్చు. అంటే ఇంకా 8 కోట్లు రావాల్సి ఉంది. ఈ రికార్డ్ సాధిస్తే.. ఇక తెలుగు స్టేట్స్ లో రాజమౌళి పాన్ ఇండియా సినిమాలను అనంతరం.. ఆ తర్వాత అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో మెగాస్టార్ మూవీ టాప్ ప్లేస్ లో ఉంటుంది.


Click it and Unblock the Notifications











