Mem Famous collections భారీ లాభాల్లోకి మేమ్ ఫేమస్.. మూడో రోజు కలెక్షన్లు ఎంతంటే?

చిన్న చిత్రాలను, కొత్త వారిని ప్రోత్సాహించే ఛాయ్ బిస్కెట్ సంస్థ లహరి ఫిలింస్‌తో కలిసి నిర్మించిన చిత్రం మేమ్ ఫేమస్. సుమంత్ ప్రభాస్, అంజిమామ, సిరి తదితరులు నటించిన ఈ చిత్రం ప్రమోషన్స్ ఈవెంట్స్ వల్ల మంచి బజ్ క్రియేట్ చేసింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా పెంచిన అంచనాలతో మంచి ఒపెనింగ్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మేమ్ ఫేమస్ సినిమాపై ఉన్న బజ్ కారణంగా ఛాయ్ బిస్కెట్, లహిరి ఫిలింస్ థియేట్రికల్ హక్కులను అమ్మకుండా సొంతంగా రిలీజ్ చేసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. అయితే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌ను సుమారు 2.5 కోట్లుగా ట్రేడ్ వర్గాలు విలువ కట్టారు.

Mem Famous 3 Days collections worldwide: Sumanth Prabhas movie into break even zone

మేమ్ ఫేమస్‌ చిత్రం విడుదలకు ముందు మంచి క్రేజ్‌ను సంపాదించుకోవడంతో భారీగా ప్రీమియర్లను ప్రదర్శించారు. ఇండియాలోనే ముందు రోజు 30 వరకు ప్రీమియర్లను వేశారు. ఇక తొలి రోజు కూడా మంచి ఒపెన్సింగ్స్ వచ్చాయి. తొలి రోజు ఆంధ్రా, నైజాం, కర్ణాటక, ఓవర్సీస్‌లో కలిపి 1.10 కోట్లు రాబట్టింది.

ఇక మేమ్ ఫేమస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్టడీగా నిలబడింది. తొలి రోజు కంటే కొంచెం ఎక్కువగా కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షలు, కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో 20 లక్షలు, ఓవర్సీస్‌లో సుమారు 15 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండో రోజు 1.15 కోట్లు రాబట్టింది. దాంతో రెండు రోజుల్లో ఈ సినిమా 2.25 కోట్లు వసూలు చేసింది.

Mem Famous 3 Days collections worldwide: Sumanth Prabhas movie into break even zone

మేమ్ ఫేమస్ తొలి రెండు రోజుల కలెక్షన్లను నిలబెట్టుకొంటూ మూడో రోజు కూడా నిలకడగా వసూళ్లను రాబట్టింది. మూడో రోజు ఆదివారం రోజున ఆంధ్రా, నైజాంలో 80 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 20 లక్షలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో 1 కోటి రూపాయలు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం మరో 25 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. దాంతో ఈ చిత్రం మూడో రోజున 1.25 కోట్లు వసూలు చేసింది.

మేమ్ ఫేమస్ సినిమా గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 1.10 కోట్లు, రెండో రోజు 1.15 కోట్లు, మూడో రోజు 1.25 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అటు ఇటుగా 3.5 కోట్ల మేర వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం నిలకడగా వసూళ్లను రాబట్టడం విశేషంగానే చెప్పుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X