Mem Famous collections భారీ ట్రోల్స్‌కు ఎదురొడ్డి.. నిలకడగా మేమ్ ఫేమస్ కలెక్షన్లు.. 4 రోజుల్లో ఎంతంటే?
ఛాయ్ బిస్కట్ ఫిలింస్, లహరి ఫిలింస్ బ్యానర్లపై శరత్ చంద్ర, అనురాగ్ మైరెడ్డి, చంద్రు సంయుక్తంగా నిర్మించిన చిత్రం మేమ్ ఫేమస్. సుమంత్ ప్రభాస్ నూతన దర్శకుడిగా పరిచయం అవుతూ హీరోగా కూడా నటించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో దాదాపు 50కి పైగా కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూరల్ బ్యాక్ డ్రాప్‌తో సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో థియేట్రికల్ రన్‌ను కొనసాగిస్తున్నది. ట్రోల్స్‌ను అధిగమించి గత 4 రోజుల్లో ఈ చిత్రం ఏ మేరకు కలెక్షన్లను సాధించిందనే విషయంలోకి వెళితే..

మేమ్ ఫేమస్ చిత్రం విడుదలకు ముందే భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు చేపట్టిన బ్యాండ్ డైలాగ్ ప్రమోషన్స్‌కు భారీ ఆదరణ లభించింది. అంతేకాకుండా సినీ పరిశ్రమలోని హీరోలు కూడా సపోర్ట్ చేయడంతో భారీ అంచనాలను ఈ సినిమా పెంచింది. అంచనాలకు తగినట్టే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించింది.
మేమ్ ఫేమస్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచే కాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా అండ లభించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి లాంటి ప్రముఖులు ఈ సినిమాపై, మూవీలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులపై ప్రశంసలు గుప్పించడం మరింత అంచనాలు పెంచింది. దాంతో ఈ సినిమా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది.
మేమ్ ఫేమస్ మూవీ గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 1.10 కోట్లు, రెండో రోజు 1.15 కోట్లు, మూడో రోజు 1 కోటి రూపాయలు రాబట్టింది. ఇండియాలో 2.6 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా అటు ఇటుగా 3.1 కోట్ల రూపాయల మేర వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఓవర్సీస్‌లో మేమ్ ఫేమస్ చిత్రం మంచి రెస్పాన్స్ కూడగట్టుకొంటున్నది. ఈ చిత్రం అమెరికా, తదితర ప్రాంతాల్లో నాలుగు రోజుల్లో ఈ చిత్రం 100K డాలర్లు అంటే 82 లక్షల రూపాయలు వసూలు చేసింది.

ఇక నాలుగో రోజు మేమ్ ఫేమస్ మూవీ నిలకడగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రంపై ఐపీఎల్ ఫైనల్ ప్రభావం పడిందనే విషయాన్ని నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రం నాలుగో రోజు 30 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ సినిమా నాలుగో రోజు ఇండియాలో 60 లక్షల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 80 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో 3.9 కోట్ల రూపాయలు రాబట్టింది.


Click it and Unblock the Notifications











