Mem Famous Closing Collections మేమ్ ఫేమస్ బడ్జెట్ ఎంత? ఎన్ని కోట్ల లాభం వచ్చిందంటే?
ఛాయ్ బిస్కెట్ ఫిలింస్, లహరి ఫిలింస్ బ్యానర్లపై శరత్, అనురాగ్, చంద్రూ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మేమ్ ఫేమస్. దాదాపు 50 మందికిపైగా కొత్త వారిని పరిచయం చూస్తూ రూపొందించిన చిత్రానికి నూతన దర్శకుడు, నటుడు సుమంత్ ప్రభాస్ దర్శకత్వం వహించి నటించాడు. యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో తెలంగాణ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ను టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే మిక్స్‌డ్ టాక్‌లోను మెరుగైన ఫలితాలు బాక్సాఫీస్ సాధించింది. మేమ్ ఫేమస్ థియేట్రికల్ రన్‌లో ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధించిందంటే?
మేమ్ ఫేమస్ చిన్న బడ్జెట్ చిత్రంగా ప్రారంభమైంది. అంతా కొత్తవారే కావడంతో ప్రొడక్షన్‌కే ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. దాంతో ఈ చిత్రానికి 3.5 కోట్ల మేర బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు, బ్యాండ్ డైలాగ్స్‌కు మంచి రెస్సాన్స్ రావడంతో భారీ క్రేజ్ పెరిగింది.

తెలుగు సినిమా హీరోలతో బ్యాండ్ డైలాగ్స్ చెప్పిస్తూ మేమ్ ఫేమస్ టీమ్ చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలు పూర్తిగా వర్కవుట్ అయ్యాయి. దాంతో ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. దాంతో ప్రేక్షకుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను సుమారు 400 పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తొలివారం ఈ సినిమాకు మంచి స్పందన లభించింది.
మేమ్ ఫేమస్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు భారీ వసూళ్లను సాధించింది. ఫస్ట్ డే ఈ సినిమా సుమారు 90 లక్షల రూపాయలు గ్రాస్, రెండో రోజు 80 లక్షల గ్రాస్, మూడో రోజు 80 లక్షల గ్రాస్, నాలుగో రోజు 45 లక్షల గ్రాస్, ఐదో రోజు 35 లక్షల గ్రాస్, ఆరో రోజు 30 లక్షల గ్రాస్, ఏడో రోజు 30 లక్షల గ్రాస్ రాబట్టింది. దాంతో తొలి వారం ఈ చిత్రం దాంతో ఈ చిత్రం 3.5 కోట్లకుపైగా వసూలు చేసింది.
ఇక రెండో వారంలో కూడా మేమ్ ఫేమస్ ఓ మోస్తారు కలెక్షన్లను సాధించింది. 8వ రోజు ఈ చిత్రం 25 లక్షలు, 9వ రోజు 30 లక్షలు, 10వ రోజు 40 లక్షలు, 11వ రోజు 15 లక్షలు, 12వ రోజు 10 లక్షల రూపాయలు, 13వ రోజు 10 లక్షలు, 14వ రోజు 10 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం రెండో వారంలో 1.5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

మేమ్ ఫేమస్ థియేట్రికల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, నైజాంలో 5 కోట్లకుపైగా గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం సుమారు ఒక కోటి రూపాయల గ్రాస్‌ను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా బడ్జెట్‌తో పోల్చితే థియేట్రికల్‌గా సూపర్ హిట్ కలెక్షన్లను సాధించడంతోపాటు లాభాలతో థియేట్రికల్ రన్‌ను క్లోజ్ చేసింది.


Click it and Unblock the Notifications











