Mem Famous day 1 collections మేమ్ ఫేమస్‌‌కు క్రేజీ ఓపెనింగ్స్..తొలి రోజు ఎన్ని కోట్లంటే?

నూతన దర్శకుడిగా, హీరోగా పరిచయమై సుమంత్ ప్రభాస్ రూపొందించిన చిత్రం మేమ్ ఫేమస్. ఛాయ్ బిస్కట్, లహిరి ఫిల్మ్స్ బ్యానర్లపై శరత్, అనురాగ్ మైరెడ్డి, చంద్రు నిర్మించిన ఈ చిత్రం మే 26వ తేదీన రిలీజైంది. మినిస్టర్ మల్లారెడ్డి చేతుల మీదుగా రిలీజైన టీజర్ ఈ సినిమాకు మంచి క్రేజ్ తెచ్చింది. ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమాపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దాంతో ఈ చిత్రం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనాల విషయానికి వస్తే..

మేమ్ ఫేమస్ చిత్రం చిన్న బడ్జెట్‌తో సుమారు 60 మందికి పైగా కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందింది. ఈ సినిమాను సుమారు 3 కోట్లకుపైగా కలెక్షన్లతో తెరకెక్కించారు. భారీగా ఖర్చు చేస్తూ ప్రమోషనల్ ఈవెంట్లతో బజ్ క్రియేట్ చేశారు.ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్ ఫిలింస్ రిలీజ్ చేసింది.

Mem Famous day 1 collections

ఇక మేమ్ ఫేమస్ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయడంతో క్యూరియాసిటీ ఏేర్పడింది. అయితే సినిమాను గీతా ఆర్ట్స్ రిలీజ్ చేయడం వలన ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. కానీ ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వ్యాల్యూను సుమారు 4 కోట్లుగా నిర్ణయించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 4 కోట్ల షేర్,7 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్ట గలిగితే.. ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

Mem Famous day 1 collections

మేమ్ ఫేమస్ సినిమాకు బజ్ క్రియేట్ కావడంతో ప్రీమియర్లకు, తొలి రోజు మంచి అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు సుమారు 30 ప్రీమియర్లు వేశారు. దాదాపు అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బుకింగ్స్ నమోదయ్యాయి. అదే జోష్ తొలి రోజు కూడా కనిపించింది. దాంతో ఈ సినిమా పాజిటివ్ నోట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Mem Famous day 1 collections

మేమ్ ఫేమస్ తొలి రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. ప్రమోషన్స్ కారణంగా మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. మార్నింగ్ షోకు 30 శాతం, మ్యాట్రీకి 35 శాతం, ఫస్ట్ షోకు 40 ఆక్యుపెన్సీ, సెకండ్ షోకు 40 శాతం అక్యుపెన్సీ నమోదు కావచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మేమ్ ఫేమస్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఒపెనింగ్స్ కనిపించాయి. నైజాంలో భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 1.5 నుంచి 2 కోట్ల వరకు కలెక్షన్లు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఓవర్సీస్‌లో 50 లక్షలు వసూలు చేయవచ్చు. దాంతో ఈ చిత్రం తొలి రోజు 2 నుంచి 2.5 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X