Mem Famous Collections అంచనాలు మించిన మేమ్ ఫేమస్ వసూళ్లు.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
టాలీవుడ్‌లో అతి చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మేమ్ ఫేమస్ ప్రమోషన్స్ కార్యక్రమాలతో భారీ బజ్‌ను మీడియా సర్కిళ్లలో క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్, బ్యాండ్ డైలాగ్ ప్రమోషన్స్‌తో సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. అలా భారీ క్రేజ్‌తో వచ్చిన ఈ చిత్రం తొలి రోజు అంచనాలు మించి కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తొలి చిత్ర దర్శకుడిగా, రచయితగా తెలుగు సినిమాలోకి అడుగుపెట్టిన సుమంత్ ప్రభాస్ అనుకొని పరిస్థితుల్లో హీరోగా కూడా మారాడు. మూడు విభిన్న పాత్రలతో తనకు తాను నిరూపించుకొనేందుకు సుమంత్ ప్రభాస్ ప్రయత్నించాడు. ఈ సినిమాను ఛాయ్ బిస్కెట్, లహిరి ఫిలింస్ బ్యానర్‌పై శరత్, అనురాగ్ మైరెడ్డి, చందు నిర్మించారు.

భారీ అంచనాలు, బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మేమ్ ఫేమస్ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. కానీ దాదాపు 50 మందికి పైగా కొత్తవారు చేసిన ఫెర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకొన్నది. అయితే ఈ సినిమాకు క్లైమాక్స్ వీక్ అనే విషయం చర్చనీంశమైంది.
మేమ్ ఫేమస్ సినిమా ప్రమోషన్స్ వల్ల ప్రీమియర్లకు, అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ప్రీమియర్లకు హౌస్‌ఫుల్స్‌తో కళకళలాడాయి. ఇక తొలి రోజు కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం మంచి ఒపెనింగ్స్ సాధించింది.

తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. అమెరికాలో మేమ్ ఫేమస్‌కు మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. ప్రీమియర్లకు, తొలి రోజు కలిపి ఈ చిత్రం 10 వేల డాలర్లను వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 10 లక్షలకుపైగా కలెక్షన్లను ప్రీమియర్ల ద్వారా రాబట్టింది. ఈ చిత్రం 90 లోకేషన్లలో మొత్తంగా 143 షోలు ప్రదర్శించారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లు, తొలి రోజు మంచి వసూళ్లు సాధించింది. నైజాం, ఆంధ్రాలో ఈ చిత్రం సుమారు 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.10 కోట్ల కలెక్షన్లను రాబట్టింది అని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాను సుమారు 2.5 కోట్ల రూపాయలతో రూపొందింది. ఈ సినిమా తొలివారాంతంలోనే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











