22 టికెట్ల అమ్మకం..ధురంధర్‌కు పోటీగా పాకిస్థానీ మూవీ.. ఫస్ట్ షోకే థియేటర్స్ నుంచి అవుట్!
ధురంధర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. పాకిస్థాన్ దేశానికి వ్యతిరేకంగా భారత్ చేసిన సీక్రెట్ ఆపరేషన్, ఇండియాను విచ్చిన్నం చేయడానికి పాకిస్థాన్‌లోని కరాచీ, లాహోర్ అడ్డగా రూపొందించిన ఉగ్రవాద కుట్రను భారతీయ సీక్రెట్ ఏజెంట్ భగ్నం చేసిన కథను ప్రేక్షకులు బ్రహ్మండంగా ఆదరించారు. ల్యారీ షహర్ పట్టణం బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. భారతీయ సినిమా పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
అయితే ఇలాంటి గొప్ప కంటెంట్ ఉన్న చిత్రానికి పోటీగా పాకిస్థాన్ సినీ రంగం ఓ సినిమాను రూపొందించి రిలీజ్ చేసింది. అయితే ఆ సినిమా పాకిస్థానీ ప్రేక్షకులనే ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమాను తొలి ఆట తర్వాత థియేటర్ల నుంచి భారీగా ఎత్తేశారు. ఇంతకు ఆ పాకిస్థానీ సినిమా ఏంటి? బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు రాణించింది? ఓ చెత్త రికార్డును సొంతం చేసుకొన్న పాకిస్థానీ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

ధురంధర్ సినిమాను టార్గెట్ చేయడానికి పాకిస్థాన్ సినీ ప్రముఖులు రూపొందించిన చిత్రం మేరా ల్యారీ (Mera Lyari). కరాచీ రాష్ట్ర ఇమేజ్‌ను పాజిటివ్ చూపించేందుకు భారీ స్కెచ్ వేశారు. పాకిస్థాన్ మహిళ ఫుట్‌బాల్ జట్టు కథతో స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో డానానీర్ మోబీన్, ఆయేషా ఓమర్, సామియా ముంతాజ్, ట్రైనెట్టే లుకాస్ లాంటి స్థానిక యాక్టర్లు నటించారు. ఈ సినిమాకు అబు అలీహా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 8వ తేదీన పాకిస్థాన్‌లోని ప్రధాన పట్టణాల్లో భారీగా రిలీజ్ చేశారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అంగవైకల్యంతో బాధపడుతున్న ఫుట్‌బాల్ కోచ్ ల్యారీ పట్టణానికి వచ్చి మహిళల ఫుట్‌బాల్ జట్టును పునరుద్దించాలని ప్లాన్ వేస్తాడు. సంప్రదాయాలతో కఠినంగా వ్యవహరించే తండ్రిని తప్పించుకొని అఫ్సానా (మోబిన్), బలవంతం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయిన కుష్‌మాలా పారిపోయి వచ్చి ఫుట్‌బాల్ కోచింగ్ క్యాంపులో చేరుతారు. ఆ తర్వాత సీక్రెట్‌గా కోచింగ్ తీసుకొని జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదుగుతారు. ఈ సినిమాలో రాజకీయ అంశాలను కూడా జొప్పించి ఇండియాకు వ్యతిరేకంగా కంటెంట్‌ను ఇరికించారు. అయితే ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి పేలవంగా రియాక్షన్ వచ్చింది.
అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలపోయాయి. తొలి రోజు కేవలం 22 ఠికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. కనీసం 500 రూపాయలకు మించి వసూళ్లను సాధించలేకపోయింది. దాంతో ఈ సినిమాను తొలి ఆట తర్వాత థియేటర్ల నుంచి ఎత్తివేయాల్సి వచ్చింది. దాంతో ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని కూడగట్టుకొన్నది. పాకిస్థాన్‌లో అత్యంత దారుణంగా డిజాస్టర్‌గా మారిన చిత్రంగా ఓ రికార్డును క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications