60 కోట్లతో రకుల్ ప్రీత్ సింగ్ మూవీ.. మేరే హస్పెండ్ కి బీవీ హిట్టా? ఫట్టా?
బాలీవుడ్ తారలు అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, భూమీ పడ్నేకర్ నటించిన తాజా చిత్రం మేరే హస్పెండ్ కి బీవీ. ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శక్తి కపూర్, డినో మారియా, ముఖేష్ రుషి, హర్ష్ గుజ్రాల్, అనితా రాజ్ హితెన్ పటేల్, కన్వల్జిత్ సింగ్ తదితరులు నటించారు. లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జాకీ భగ్నానీ, వషు భగ్నానీ, దీప్షిక దేశ్‌ముఖ్ నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి ఏమిటి? బడ్జెట్ ఎంత? కలెక్షన్ల వసూళ్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో భారీగా తారాగణంతో రూపొందింది. ఈ సినిమాకు పాపులర్ టెక్నిషియన్స్ పనిచేయడంతో నిర్మాణ వ్యయం భారీగానే అయింది. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ చిత్రాన్ని సుమారుగా 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

అంకుర్ చద్దా (అర్జున్ కపూర్)కు భార్య పబ్లీన్ కౌర్ ధిల్లాన్ (భూమీ పడ్నేకర్) మ్యారేజ్ బ్రేకప్ అవుతుంది. భార్యతో సపరేట్ అంకుర్‌కు కాలేజీ సమయంలో పీకల్లోతు ప్రేమలో మునిగిన అంత్ర ఖన్నా (రకుల్ ప్రీత్ సింగ్)కు దగ్గరవుతాడు. ఈ క్రమంలో అన్ని మరిచిపోయి అంకుర్ వద్దకు భార్య పబ్లీన్ వస్తుంది. ఇద్దరి మధ్య నలిగిన అంకుర్ చివరకు పబ్లిన్‌తో కాపురం చేశాడా? ప్రియురాలు అంత్రాకు దగ్గరయ్యాడా? అనేది సినిమా కథ.
మేరే హస్పెండ్ కి బీవీ సినిమా ప్రమోషన్స్‌ను వినూత్నంగా నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులను రప్పించడానికి ఒక టికెట్ కొంటే ఒకటి ఉచితం అనే స్కీమ్‌ను అమలు చేశారు. దాంతో సినిమాకు తొలి మూడు రోజులు అంటే మొదటి వారాంతం వర్కవుట్ అయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్ల పరంగా పుంజుకోలేకపోయిందని పేర్కొన్నారు.

అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మొదటి రోజు 1.5 కోట్ల రూపాయలు, రెండవ రోజు 1.7 కోట్ల రూపాయలు, 3వ రోజు 1.25 కోట్ల రూపాయలు, 4వ రోజు 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 5 కోట్ల మేర వసూళ్లను సాధించింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాకు సుమారుగా 50 లక్షల రూపాయలు రాబట్టిందని పేర్కొన్నారు. దాంతో ఈ మూవీ 5.5 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం ఈ మూవీ 40 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తొలివారం ముగిసే సమయానికి ఈ సినిమా సుమారుగా 7 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం కనిపిస్తున్నది. ఈ చిత్రం థియేట్రికల్‌గా లాభాల్లోకి రావాలంటే.. దాదాపు 33 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తే అది మ్యాజిక్ అవుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











