Merry Christmas Box Office Collections విజయ్ సేతుపతి బాలీవుడ్ ఎంట్రీ.. కత్రినా కైఫ్ మెర్రీ క్రిస్మస్‌కు ఎన్ని

అంధాధూన్ ఫేమ్, ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్‌లో రమేష్ తౌరానీ నిర్మించిన చిత్రం మెర్రీ క్రిస్మస్. కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి, రాధికా ఆప్టే తదితరులు నటించిన ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దక్షిణాది స్టార్ విజయ్ సేతుపతి తొలిసారి హిందీలోకి అడుగుపెట్టి హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హిందీ, తమిళ భాషల్లో రిలీజైన మెర్రీ క్రిస్మస్ సినిమాలో విజయ్ సేతుపతి, కత్రినాకైఫ్, రాధిక శరత్ కుమార్, టిన్ను ఆనంద్, వినయ్ పాథక్, సంజయ్ కపూర్ లాంటి తారలు నటించడం తెలిసిందే. ఈ సినిమాలో నటించిన, పనిచేసిన సాంకేతిక నిపుణల రెమ్యునరేసన్లు, ప్రమోషన్స్ ఖర్చులు కలిపి ఈ సినిమా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Merry Christmas Exepected Box Office Collections Worldwide: Katrina Kaif, Vijay Sethupathi GBOC

మెర్రీ క్రిస్మస్ (Merry Christmas Budget) సినిమాకు మంచి బజ్ క్రియేట్ కావడంతో ఇండియాలో భారీగానే రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఇండియాలో 2000 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక ఈ సినిమా కనీసం 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. 30 కోట్లు వసూలు చేస్తే సినిమా హిట్‌గా నిర్ణయించారు.

మెర్రీ క్రిస్మస్ సినిమా హిందీ, తమిళంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దాంతో ఆక్యుపెన్సీ పరంగా తడబాటుకు గురైంది. మార్నింగ్ షోకు 15 శాతం, మ్యాట్నీకి 20 శాతం, ఫస్ట్ షోకు 25 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీని రాబట్టింది.

Merry Christmas Exepected Box Office Collections Worldwide: Katrina Kaif, Vijay Sethupathi GBOC

మెర్రీ క్రిస్మస్ (Merry Christmas Collections) కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ హిందీలో 2.3 కోట్లు నికరంగా, తమిళంలో 22 లక్షలు, తమిళంలో 3 లక్షల నికరంగా వసూలు చేసింది. దాంతో తొలి రోజున ఈ సినిమా నికరంగా 2.55 కోట్లు, 5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

ఇక మెర్రీ క్రిస్మస్ (Merry Christmas) మూవీ రెండో రోజు స్ట్రాంగ్‌గా ఉంది. తొలి రోజు కంటే 2వ రోజు ఎక్కువగా కలెక్షన్లు రాబట్టింది. 3.5 కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తుంది. హిందీలో 3.1 కోట్లు, తమిళంలో 33 లక్షలు రాబట్టింది. ఓవర్సీస్‌తోపాటు రిలీజైన అన్ని సెంటర్లు ఈ సినిమా రెండు రోజుల్లో 7 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించే అవకాశ ఉంది. మూడో రోజు ఈ సినిమా 2.68 కోట్ల రూపాయలు రాబట్టింది.

మెర్రీ క్రిస్మస్ చిత్రం 4వ రోజు 1.25 కోట్లు, 5వ రోజు 1 కోటి రూపాయలు, 6వ రోజు 85 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఏడో రోజు ఈ సినిమా 80 లక్షలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 7 రోజుల్లో 13 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X