Meter Day 1 Collections మీటర్ మూవీకి ఊహించని కలెక్షన్లు.. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో షాకింగ్‌గా!

వినరో భాగ్యం విష్ణు కథ చిత్రంతో భారీ హిట్ కొట్టిన యువ హీరో కిరణ్ అబ్బవరం మంచి మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మీటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 7వ తేదీన రిలీజైన ఈ సినిమా ద్వారా రమేష్ కోడూరి అనే డైరెక్టర్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

మీటర్‌కు మంచి బజ్ క్రియేట్ కావడంతో: మీటర్ సినిమా టీజర్లు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ రావడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. మీటర్ పాటలు, సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమాపై హైప్ పెరిగింది. దాంతో ఈ సినిమా విజయం సాధిస్తుందనే అంచనాకు ట్రేడ్ వర్గాలతో సినీ అభిమానులు కూడా వచ్చారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన లభించింది.

Meter Day 1 Expected Collections Worldwide: Kiran Abbavaram Movie struggling at Box office

మీటర్ బడ్జెట్.. ప్రీ రిలీజ్ బిజినెస్: మీటర్ సినిమాను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ దాదాపు 8 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ముందు అనుకొన్న బడ్జెట్ కంటే ఎక్కువగానే అయింది. క్వాలిటీ మిస్ కాకుడదనే ఉద్దేశంతో సినిమాను రిచ్‌గా రూపొందించాం అని నిర్మాత చెర్రీ మీడియాకు వెల్లడించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ సొంతంగా డిస్ట్రిబ్యూషన్ చేసింది. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 4.5 కోట్లుగా అంచనా వేశారు.

మీటర్ థియేటర్ కౌంట్.: మీటర్ సినిమా థియేటర్ కౌంట్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 460 స్క్రీన్లలో రిలీజ్ అయింది. నైజాంలో 90 స్క్రీన్లు, సీడెడ్‌లో 40 స్క్రీన్లు, ఆంధ్రాలో 150 స్క్రీన్లలో ప్రదర్శించారు. ఆంధ్రా, నైజాంలో మొత్తం 280 స్క్రీన్లకుపైగా ప్రదర్శించారు. ఇక కర్ణాటక, ఓవర్సీస్‌లో కలిపి 180 స్క్రీన్లలో ప్రదర్శించారు.

Meter Day 1 Expected Collections Worldwide: Kiran Abbavaram Movie struggling at Box office

మీటర్ మూవీ ఆక్యుపెన్సీ: అయితే మీటర్ సినిమాకు తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. సినీ విమర్శకులు ఈ సినిమాపై పెదవి విరిచారు. మార్నింగ్ షోలకు 15 శాతం, మ్యాట్నికి 10 శాతం, ఫస్ట్ షోకు 11 శాతం, సెకండ్ షోకు 10 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఓవరాల్‌గా తొలి రోజు 12 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది.

మీటర్ తొలి రోజు కలెక్షన్ల అంచనా: మీటర్ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఓవర్సీస్‌లో చిత్రానికి పెద్దగా స్పందన కనిపించలేదు. ప్రీమియర్లకు 20 లోకేషన్లలో 27 షోల ద్వారా 170 డాలర్లు, తొలి రోజు 55 లొకేషన్లలో 104 షోల ద్వారా 2 వేల డాలర్లు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సుమారు 1 కోటి రూపాయలు గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Meter Day 1 Expected Collections Worldwide: Kiran Abbavaram Movie struggling at Box office

మీటర్ లాభాల్లోకి రావాలంటే? : మీటర్ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమా భారీగానే కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. ప్రపంచవ్యాప్తంగా కనీసం 4.5 కోట్ల షేర్, 9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనే విషయం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. గత సినిమాలతో పోల్చుకొంటే మీటర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవంగా కలెక్షన్ల యాత్రను మొదలుపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X