Meter Day 3 Collections పడిపోయిన బాక్సాఫీస్ మీటర్.. లాభాల్లోకి రావాలంటే?

వినరో భాగ్యము విష్ణుకథ భారీ విజయం తర్వాత యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం మీటర్. పక్కా కమర్షియల్ అంశాలతో ఫాదర్ సెంటిమెంట్‌తో నూతన దర్శకుడు రమేష్ కాడూరి అల్లుకొన్న కథ రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు పెంచింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో చిరంజీవి (మైత్రీ చెర్రీ) నిర్మించారు. అయితే టీజర్లు, ట్రైలర్లు భారీ బజ్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాపై ఆశలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీటర్ 3వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

పేలవంగా బాక్సాఫీస్ కలెక్షన్లు: రిలీజ్‌కు ముందు ఏర్పడిన పాజిటివ్ బజ్‌తో మీటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పాతకాలం నాటి కథ, పేలవమైన కథనంతో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. దాంతో సగటు ప్రేక్షకుడు, సినీ విమర్శకులు ఈ సినిమాపై చేతులెత్తేశారు. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ నంబర్లు ప్రతికూలంగా మారాయి. గత కిరణ్ అబ్బవరం సినిమాలతో పోల్చితే పేలవమైన వసూళ్లను నమోదు చేస్తున్నది.

Meter Day 3 Collections Worldwide: Kiran Abbavaram movie into negative zone at World box office

బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఎంతంటే?: మీటర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఇటీవల డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేశారు. ఈ సినిమా బడ్జెట్, కిరణ్ అబ్బవరం గత సినిమాలు సాధించిన కలెక్షన్ల వివరాలను అంచనా వేసుకొని మీటర్ మూవీ బ్రేక్ ఈవెన్‌ను 4 కోట్లకుపైగానే అంచనా వేశారు. దాదాపు 4 కోట్లకుపైగా టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఏపీ, నైజాంలో గత మూడు రోజుల్లో: ఇక ఏపీ, తెలంగాణలో మీటర్ గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. చాలా దారుణంగా కనిపించాయి. తొలి రోజు 50 లక్షల గ్రాస్, రెండో రోజు 40 లక్షల గ్రాస్ రాబట్టింది. ఇక సండే రోజున ఈ సినిమా ఫేట్ మారుతున్న వారికి నిరాశే మిగిల్చింది. ఆదివారం సెలవు దినం రోజున 36 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 1.26 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Meter Day 3 Collections Worldwide: Kiran Abbavaram movie into negative zone at World box office

యూఎస్ బాక్సాఫీస్ వద్ద: అమెరికాలో మీటర్ సినిమా పెద్దగా వసూళ్లు నమోదు చేయలేకపోయింది. ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 20 లొకేషన్లలో 27 షోల ద్వారా 170 డాలర్లు, తొలి రోజు 55 లొకేషన్లలో 104 షోల ద్వారా 1930 డాలర్లు, రెండో రోజు 54 లొకేషన్ల ద్వారా 93 షోల ద్వారా 960 డాలర్లు, 50 లొకేషన్లలో 86 షోల ద్వారా 253 డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 3300కుపైగా అమెరికన్ డాలర్లు అంటే సుమారు 3 లక్షల రూపాయలను రాబట్టింది.

మీటర్ లాభాల్లోకి రావాలంటే?: ఇదిలా ఉంటే.. మీటర్ చిత్రం 4 కోట్ల వాల్యూతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. అయితే గత మూడు రోజుల్లో 60 లక్షల షేర్, 1.26 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా క్లోజింగ్ వరకు భారీ నష్టాలతో ముగిసే అవకాశం కనిపిస్తున్నది. గత మూడు రోజుల్లో చాలా ప్రాంతాల్లో నెగిటివ్ జోన్‌లోకి వెళ్లిందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. తొలివారంలో చాలా థియేటర్ల నుంచి సినిమాను తీసేసే పరిస్థితి ఉంది. చాలా చోట్ల రెంట్ ఎదురు కట్టాల్సిన పరిస్థితి ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X