Michael Box Office: 3 రోజుల్లో 2000 వేల కోట్ల కలెక్షన్స్... మైఖేల్ జాక్సన్ బయోపిక్‌ ఆల్‌టైం రికార్డ్!

లెజెండరీ పాప్ సింగర్, దివంగత మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన బయోపిక్ మైఖేల్. జాఫర్ జాక్సన్, కాల్మన్ డొమింగో, మైల్స్ టెల్లెర్, లారా హారియర్, సుజాన్ డీ పాసేగా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జాన్ లోగన్ రచనా సహకారం అందించగా, ఆంటోని ఫుక్వా దర్శకత్వం వహించారు. గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్లెయిన్‌లు సంయుక్తంగా నిర్మించారు. డియాన్ బీబే సినిమాటోగ్రఫి, జాన్ ఓట్టమన్ ఎడిటింగ్, లియర్ రాస్నర్ సంగీత దర్శకత్వం వహించారు. లయన్స్ గేట్ ఫిల్మ్స్, జీకే ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందిన మైఖేల్ ఏప్రిల్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ నేపథ్యంలో మైఖేల్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? మూడు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టింది? భారత్‌లో దాని వసూళ్లు ఎంత? అనేది పరిశీలిస్తే..

మైఖేల్ మూవీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ఇతర ఖర్చులు కలిపి మైఖేల్ మూవీని 170 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 1600 కోట్లుతో నిర్మించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మైఖేల్ చిత్రాన్ని అమెరికాలో లైయాన్స్‌గేట్ ఫిల్మ్స్ సొంతంగా రిలీజ్ చేస్తుండగా.. విదేశాల్లో యూనివర్సల్ పిక్చర్స్ విడుదల చేసింది.

Michael 3 Days Expected Box Office Collections Worldwide Michael Jackson s Biopic creates record with 217 Million Collections for first weekend

మైఖేల్ మూడు రోజుల కలెక్షన్స్
ఆదివారం వరకు మైఖేల్ మూవీకి అమెరికాలో 97 మిలియన్ డాలర్లు (913 కోట్ల రూపాయలు), విదేశాలలో 120.4 మిలియన్ డాలర్లు (1134 కోట్ల రూపాయలు) మొత్తంగా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 217 మిలియన్ డాలర్లు (2047 కోట్ల రూపాయలు) వసూలు చేసి చరిత్ర సృష్టించాడు మైఖేల్. అంతేకాదు ఇప్పటి వరకు ఏ బయోపిక్‌కి అమెరికాలో రాని అత్యధిక వసూళ్లను మైఖేల్ సాధించింది. ఇప్పటి వరకు ఒపెన్ హైమర్ 80 మిలియన్ డాలర్లు (754 కోట్ల రూపాయలు) రికార్డును బద్ధలుకొట్టింది.

కోవిడ్ తర్వాత లయన్స్‌గేట్‌కు ఇది అత్యుత్తమ చిత్రంగా మైఖేల్ నిలిచింది. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఓపెనింగ్స్‌ను అధిగమించడంతో పాటు ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ తర్వాత నార్త్ అమెరికాలోతో పాటు వరల్డ్ వైడ్‌గా రెండవ అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించిన మూవీగా మైఖేల్ చోటు దక్కించుకుంది. మైఖేల్ జాక్సన్‌కు ఉన్న ఆదరణ నేపథ్యంలో అమెరికాతో పాటు పాటు యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రెజిల్, ఆస్ట్రేలియా, స్పెయిన్, నెదర్లాండ్స్, దక్షిణాసియాలలో మ్యూజిక్ బయోపిక్ జోనర్స్‌కు కొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

భారత్‌లో మైఖేల్ వసూళ్లు
మైఖేల్ జాక్సన్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఉన్న దేశాలలో భారత్ కూడా ఒకటి. ఈ క్రమంలో ఈ సినిమాకు ఇండియాలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్‌కు 1.70 కోట్ల రూపాయలు, తొలిరోజున 3.70 కోట్ల రూపాయలు, రెండో రోజున 5.10 కోట్ల రూపాయలు, మూడో రోజున 5.50 కోట్ల రూపాయలు చొప్పున మూడు రోజుల్లో మైఖేల్ మూవీ ఇండియాలో 16 కోట్ల రూపాయలు నెట్.. 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. భారతీయ సినిమాలు, ఐపీఎల్ ప్రభంజనంలోనూ మైఖేల్ మనదేశంలో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక నాలుగో రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇండియాలో మైఖేల్ మూవీకి 842 షోలు ప్రదర్శితమై.. 22 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ బయోపిక్ మూవీ నాలుగో రోజు భారత్‌లో కోటి 50 లక్షల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X