Michael Day 1 Collections: మైఖేల్‌కి రికార్డ్ వసూళ్లు.. మైఖేల్ జాక్సన్ బయోపిక్‌కి తొలిరోజు ఎన్ని కోట్లంటే?
కింగ్ ఆఫ్ పాప్, లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవితంలోని కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకొని రూపొందించిన బయోపిక్ మైఖేల్. మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటించారు. ఇదే ఆయన డెబ్యూ మూవీ కావడం విశేషం. ఈ చిత్రానికి జాన్ లోగన్ రచనా సహకారం అందించగా, ఆంటోని ఫుక్వా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ తండ్రిగా కాల్మన్ డొమింగో, తల్లిగా మైల్స్ టెల్లెర్, సుజాన్ డీ పాసేగా లారా హారియర్ తదితరులు నటించారు. మైఖేల్ జాక్సన్ బయోపిక్ కావడంతో పాప్, హాలీవుడ్ సహా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
మైఖేల్ మూవీ తారాగణం
గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్లెయిన్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి డియాన్ బీబే సినిమాటోగ్రఫి, జాన్ ఓట్టమన్ ఎడిటింగ్, లియర్ రాస్నర్ సంగీత దర్శకత్వం వహించారు. లయన్స్ గేట్ ఫిల్మ్స్, జీకే ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందిన మైఖేల్ ఏప్రిల్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ నేపథ్యంలో మైఖేల్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టింది? భారత్‌లో దాని వసూళ్లు ఎంత? అనేది పరిశీలిస్తే..

మైఖేల్ మూవీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ఇతర ఖర్చులు కలిపి మైఖేల్ మూవీని 170 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 1600 కోట్లుతో నిర్మించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మైఖేల్ చిత్రాన్ని అమెరికాలో లైయాన్స్‌గేట్ ఫిల్మ్స్ సొంతంగా రిలీజ్ చేస్తుండగా.. విదేశాల్లో యూనివర్సల్ పిక్చర్స్ విడుదల చేసింది.
మైఖేల్ మూవీ తొలిరోజు కలెక్షన్స్
నార్త్ అమెరికాలో ప్రీవ్యూ షోల ద్వారా మైఖేల్ మూవీ 12.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 117 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం తొలిరోజు ఫ్రాన్స్‌లో 2.6 మిలియన్లు (24 కోట్ల రూపాయలు), యూకే అండ్ ఐర్లాండ్‌లో 2.6 మిలియన్లు (24 కోట్ల రూపాయలు), ఇటలీలో 1.3 మిలియన్ డాలర్లు (12.25 కోట్ల రూపాయలు), ఆస్ట్రేలియాలో 1 మిలియన్ డాలర్లు (9.42 కోట్ల రూపాయలు), బ్రెజిల్‌లో 2 మిలియన్ డాలర్లు (18.85 కోట్ల రూపాయలు) చొప్పున వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 18.5 మిలియన్ డాలర్లు (175 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఫస్ట్ వీకెండ్‌లో మైఖేల్ మూవీ వరల్డ్ వైడ్‌గా 150 డాలర్లకు పైగా (1400 కోట్ల రూపాయలు) వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
భారత్‌లో మైఖేల్ వసూళ్లు
భారత్‌లో ఏప్రిల్ 23వ తేదీన మైఖేల్ మూవీకి ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా 1.93 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది. ఇక తొలిరోజున మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సినిమాకు భారత్‌లో 1300 షోలు ప్రదర్శితమై.. 4 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీతో 78 లక్షల రూపాయలు రాబట్టింది. ఈ సినిమా తొలిరోజు ఇండియాలో 3.50 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications