7612 కోట్లతో మైఖేల్ సంచలన రికార్డు.. ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

కింగ్ ఆఫ్ పాప్, లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్న అమెరికన్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామా మైఖేల్ (Michael). మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ సినీ రంగ ప్రవేశం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ లోగన్ రచనా సహకారం అందించగా, ఆంటోని ఫుక్వా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ తండ్రిగా కాల్మన్ డొమింగో, తల్లిగా మైల్స్ టెల్లెర్, సుజాన్ డీ పాసేగా లారా హారియర్ తదితరులు నటిస్తున్నారు.

వరల్డ్ పాప్ కింగ్ జాక్సన్ బయోపిక్‌ను గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్లెయిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డియాన్ బీబే సినిమాటోగ్రఫి, జాన్ ఓట్టమన్ ఎడిటింగ్, మ్యూజిక్: లియర్ రాస్నర్ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. లయన్స్ గేట్ ఫిల్మ్స్, జీకే ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 24వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Michael Movie 31 Days Box Office

మైఖేల్ జాక్సన్ బయోపిక్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను సుమారుగా 200 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా 200 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇండియాలో మైఖేల్ జాక్సన్ బయోపిక్‌కు భారీ ఆదరణ లభిస్తున్నది. గత 31 రోజులకుపైగా ఈ సినిమా అభిమానులను ఆకట్టుకొంటున్నది. ఈ చిత్రం ఇండియాలో తొలివారం 26 కోట్ల రూపాయలు, రెండో వారం 18 కోట్ల రూపాయలు, మూడో వారం 11 కోట్ల రూపాయలు, నాలుగో వారం 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఐదో వారంలో 29వ రోజు 50 లక్షలు, 30వ రోజు 1 కోటి రూపాయలు 31వ రోజు 1.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 65 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

వరల్డ్ వైడ్‌గా మైఖేల్ చిత్రం రికార్డులను తిరగరాస్తు్ననది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 7612 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. వెరైటీ వెల్లడించిన సమాచారం ప్రకారం.. నార్త్ అమెరికాలో ఈ చిత్రం 468 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో 4455 కోట్లు), ఓవర్సీస్‌లో ఈ చిత్రం 320 మిలియన్ డాలర్లు (3147 కోట్లు) వసూలు చేసింది అని తన కథనంలో వెల్లడించింది.

అయితే మ్యూజికల్ బయోపిక్స్‌లో ఇప్పటి వరకు బహెమీయన్ రాప్సోడీ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ సినిమా వసూళ్లపై మైఖేల్ కన్నేసింది. రానున్న రోజుల్లో ఈ రికార్డును మైఖేల్ జాక్సన్ బయోపిక్ తిరగరాస్తుందా? అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X