Michael Box Office: 9238 కోట్ల కలెక్షన్లతో మైఖేల్ సంచలనం.. క్రిస్టఫర్ నోలన్ మూవీ బాక్సాఫీస్ రికార్డు బ్రేక్

కింగ్ ఆఫ్ పాప్, లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకొని రూపొందిన అమెరికన్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామా మైఖేల్ (Michael) ప్రపంచవ్యాప్తంగా అరుదైన వసూళ్లను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. బయోపిక్ సినిమాల్లో అత్యున్నత రికార్డును క్రియేట్ చేయడమే కాకుండా చరిత్ర సృష్టించింది. మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ సినీ రంగ ప్రవేశం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి జాన్ లోగన్ రచనా సహకారం అందించగా, ఆంటోని ఫుక్వా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ తండ్రిగా కాల్మన్ డొమింగో, తల్లిగా మైల్స్ టెల్లెర్, సుజాన్ డీ పాసేగా లారా హారియర్ తదితరులు నటించారు.

వరల్డ్ పాప్ కింగ్ జాక్సన్ బయోపిక్‌ను గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్లెయిన్ నిర్మించారు. ఈ చిత్రానికి డియాన్ బీబే సినిమాటోగ్రఫి, జాన్ ఓట్టమన్ ఎడిటింగ్, మ్యూజిక్: లియర్ రాస్నర్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. లయన్స్ గేట్ ఫిల్మ్స్, జీకే ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 24వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Michael Movie Box Office

మైఖేల్ జాక్సన్ బయోపిక్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను సుమారుగా 200 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా 200 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇండియాలో మైఖేల్ చిత్రం ఆశించినంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం తొలి వారంలో 26 కోట్లకుపైగా నెట్, రెండో వారంలో 18.5 కోట్ల రూపాయలు, మూడో వారంలో 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక నాలుగో వారం ముగిసే సమయానికి 61 కోట్ల రూపాయల నెట్, 73 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది.

కింగ్ ఆఫ్ పాప్ పేరుతో రూపొందిన ఈ సినిమా నార్త్ అమెరికాలో ప్రభంజనం సృష్టించింది. 10వ వారంలో కూడా 905K కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం నార్త్ అమెరికా అంటే కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 370.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో 3500 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

నార్త్ అమెరికా కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ సినిమా 10వ వారంలో కూడా సత్తా చాటింది. జపాన్, రష్యాలో ఈ సినిమా భారీగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం అన్నీ దేశాల్లో కలిపి 8.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. గత 10 వారాల్లో ఇప్పటి వరకు 607.2 మిలియన్ డాలర్లు అంటే.. 5738 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 977.5 మిలియన్ డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో 9238 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ చిత్రం ఇప్పటి వరకు బయోపిక్స్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టలిన క్రిస్టఫర్ నోలన్ సినిమా ఆప్పెన్‌హీమర్ (Oppenheimer) సినిమా కలెక్షన్లను అధిగమించింది. ఈ చిత్రం టోటల్ థియేట్రికల్ రన్‌లో 975.8 మిలియన్ డాలర్లు అంటే.. 9214 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే ప్రస్తుతం మైఖేల్ 9238 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మైఖేల్ జాక్సన్ మరోసారి సినిమా రూపంలో అభిమానుల్లో మ్యాజిక్ క్రియేట్ చేశారంటూ ట్రేడ్ వర్గాలు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X