twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Michael day 1 collections మైఖేల్‌కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?

    |

    యువ హీరో సందీప్ కిషన్, అందాల భామ దివ్యాంశ కౌశిక్ జంటగా, నటుడు, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ భరద్వాజ్, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం మైఖేల్. కరణ్ సీ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమా బ్యానర్లపై భరత్ చౌదరీ, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా హిందీ, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజైంది. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే..

    విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్, వరలక్ష్మీ

    విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్, వరలక్ష్మీ

    ముంబై బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగస్టర్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం తొలి రోజు తెలుగులో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. తమిళంలో ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ రెస్సాన్స్ లభిస్తున్నది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రలకు మంచి స్పందన వస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సందీప్ కిషన్‌కు తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషంగా మారింది.

    వరల్డ్ వైడ్ 1500 స్క్రీన్లలో రిలీజ్

    వరల్డ్ వైడ్ 1500 స్క్రీన్లలో రిలీజ్

    మైఖేల్ చిత్రాన్ని క్రేజీ నటీనటులతో రూపొందించడంతో భారీ బడ్జెట్ చిత్రంగా మారింది. ఈ సినిమాను సుమారు 30 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. తమిళంలో ఈ సినిమా బిజినెస్ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. తెలుగులో భరత్ చౌదరీ సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను తమిళనాడులో 295, తెలుగులో 200 స్క్రీన్లలో, మిగితా భాషల్లో కలిపి దాదాపు 1500 థియేటర్లలో రిలీజ్ చేయడం సందీప్ కిషన్ కెరీర్‌లో రికార్డుగా మారింది.

    తెలుగు, తమిళంలో తొలిరోజు ఆక్యుపెన్సీ

    తెలుగు, తమిళంలో తొలిరోజు ఆక్యుపెన్సీ

    మైఖేల్ తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 32 శాతం, విజయవాడలో 25 శాతం, వరంగల్‌లో 68 శాతం, గుంటూరులో 33 శాతం, వైజాగ్‌లో 30 శాతం, కరీంనగర్‌లో 64 శాతం, కాకినాడలో 35 శాతం, నెల్లూరులో 17 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఇక తమిళనాడులో చెన్నై, మధురై, కోయంబత్తూరు, ఇతర ప్రధాన పట్టణాల్లో 30 శాతానికి పైగా ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

    హిందీ, ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి

    హిందీ, ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి

    ఇక తెలుగు, తమిళేతర రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం కనిపించలేదు. హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. ఢిల్లీలో 5 శాతం, ముంబైలో 5 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదైంది. బెంగళూరులో అత్యధికంగా 40 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

    మైఖేల్ తొలి రోజు కలెక్షన్ల అంచనా

    మైఖేల్ తొలి రోజు కలెక్షన్ల అంచనా

    ఇక మైఖేల్ మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. తొలి రోజున తెలుగులో 1 నుంచి 1.5 కోట్ల గ్రాస్, తమిళంలో 2 నుంచి 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 నుంచి 5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    English summary
    Varalaxmi Sarathkumar, Sandeep Kishan, Vijay Sethupati, Gautham Vasudev Menon latest movie Michael has arrived in Theatres on February 3rd. Here is the day 1 expected collections details worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X