Michael Day 2 collections మైఖేల్‌కు డీసెంట్ కలెక్షన్లు.. సందీప్ కిషన్ కెరీర్‌లో బెస్ట్.. అక్కడ డిజాస్టర్!
యువ హీరో, హీరోయిన్లు సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ జంటగా రంజీత్ జయకోడి దర్శకత్వంలో రూపొందిన మైఖేల్ చిత్రం ట్రేడ్ వర్గాల అంచనాలను మంచి కలెక్షన్లు సాధించింది. ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ మూటగట్టుకొంటున్నది. గౌతమ్ వాసుదేవ మీనన్, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం తొలి రోజు భారీ వసూళ్లు నమోదు చేసింది. ఇక రెండో రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

తొలి రోజు కలెక్షన్లు ఇలా..
పాన్ ఇండియా చిత్రంగా మైఖేల్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజైంది. ఈ చిత్రం తెలుగు, తమిళంలో భారీ వసూళ్లు రాబట్టింది. తొలి రోజున అన్ని భాషల్లో కలిపి 4.6 కోట్ల గ్రాస్, 2.5 కోట్ల షేర్ వసూలు చేసింది. సందీప్ కిషన్ కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్లను నమోదు చేసింది.

తెలుగులో రెండో రోజు ఆక్యుపెన్సీ
తెలుగు వెర్షన్ మైఖేల్ రెండో రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో 30 శాతం, బెంగళూరులో 40 శాతం, విజయవాడలో 27 శాతం, వరంగల్‌లో 71 శాతం, గుంటూరులో 29 శాతం, వైజాగ్‌లో 27 శాతం, నిజమాబాద్‌లో 11 శాతం, కరీంనగర్‌లో 69 శఆతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

తమిళంలో రెండో రోజు ఆక్యుపెన్సీ
తమిళ వెర్షన్ మైఖేల్ రెండో రోజు విషయానికి వస్తే.. చెన్నైలో 21 శాతం, బెంగళూరులో 53 శాతం, మధురైలో 16 శాతం, కోయంబత్తూరులో 21 శాతం, పాండిచ్చేరిలో 55 శాతం, సలెంలో 44 శాతం, వెల్లూరులో 21 శాతం, తిరుచ్చి 50 శాతం, హైదరాబాద్‌లో 40 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

హిందీలో డిజాస్టర్‌గా కలెక్షన్లు
ఇక హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. ఆగ్రాలో 73 శాతం ఆక్యుపెన్సీ తప్పా.. నాసిక్, వడోదర, నాగ్‌పూర్, లక్నో, భోపాల్, జైపూర్, సూరత్, ఆహ్మాదాబాద్, కోల్ కతా, పూణే, ఢిల్లీ, ముంబైలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఉత్తరాదిలో పెద్దగా ప్రమోషన్స్ జరపకపోవడం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల వద్దకు రీచ్ కాలేకపోయిందనే మాట వినిపిస్తున్నది.

రెండో రోజు కలెక్షన్ల అంచనా
మైఖేల్ చిత్రం రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం రెండో రోజు కూడా నిలకడగా వసూళ్లను నమోదు చేస్తున్నది. తొలి రోజున 2.5 కోట్ల షేర్, 4.6 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం అదే రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. రెండో రోజున కూడా 4 నుంచి 5 కోట్ల మధ్య వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం రెండు రోజుల్లో 9 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











