షాక్ అవుతున్నారు : దటీజ్ జూ.ఎన్టీఆర్ స్టామినా
హైదరాబాద్ : ఎన్.టి.ఆర్, సమంత జంటగా 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సమర్పణలో బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మించిన 'రభస' ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి రిలీజ్ కు ముందు జరిగిన ప్రీ రిలీజ్ కూడా ఓ రేంజిలో జరిగి ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ సినిమాలు ఊహించిన రేంజిలో హిట్ కాకపోవటం,ఈ సినిమాకు పబ్లిసిటీ కూడా సరిగ్గా లేకపోవటం వంటి అంశాలతో ఈ సినిమా బిజినెస్ పెద్దగా ఉండదని అంతా అనుకున్నారు. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ చూసిన వారు షాక్ అవుతున్నారు.
సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీకి సెన్సార్ నుండి 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. ఓవరాల్ గా ఈ సినిమాలో 7 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి అందువలనే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది యూత్‌ఫుల్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్ కొత్తగా కనిపిస్తాడు. కుటుంబం మొత్తం చూసి ఆనందించేలా ఈ చిత్రం ఉంటుంది.
ట్రేడ్ లో చెప్పుకునే దాన్ని బట్టి ఏరియాల వారిగా....

నైజాం ----: 12 Cr
సీడెడ్ ----: 7.5Cr
నెల్లూరు----- : 1.9 Cr
గుంటూరు---: 3.85 Cr
ఈస్ట్ గోదావరి -------: 2.5 Cr
వెస్ట్ గోదావరి ------: 2.5 Cr
వైజాగ్............: 4.5 Cr
కృష్ణ............: 2.5 Cr
మిగిలిన ఇండియా-------: 1 Cr
కర్ణాటక............. :3.5 Cr
గల్ఫ్,యుకె. తో కలిపి ఓవర్ సీస్ ....: 3 Cr
తెలుగు థియోటకల్ రైట్స్ మొత్తం అన్ని చోట్లా కలిపి :44.5 కోట్లు
శాటిలైట్: 8 కోట్లు
ఆడియో:0.50
తెలుగు మొత్తం : 53 కోట్లు
హిందీ డబ్బింగ్, శాటిలైట్ కలిపి: 3 కోట్లు
తెలుగు,హిందీ మొత్తం కలిపి: 56 కోట్లు
గమనిక : ఇవన్నీ ట్రేడ్ లో చెప్పబడుతున్న లెక్కలు మాత్రమే. అధికారిక లెక్కలు మాత్రం కాదని గమనించగలరు
ఎన్టీఆర్,సమంత తో పాటు ప్రణీత, బ్రహ్మానందం, అలీ, నాజర్, జయసుధ, బ్రహ్మాజీ, జె.పి, నాగినీడు, షాయాజీషిండే తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.్థమన్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: బెల్లంకొండ సురేష్, నిర్మాత: బెల్లంకొండ గణేష్‌బాబు, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











