Mirage Day 2 Box Office: మిరేజ్ ఓపెనింగ్ డే వసూళ్లు.. దృశ్యం 2 డైరెక్టర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ నుంచి వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మిరేజ్. ఈ చిత్రంలో మలయాళ హీరో ఆసిఫ్ అలీ, టాలెంటెడ్ హీరోయిన్ అపర్ణ బాలమురళీ జంటగా నటించారు. అపర్ణ ఆర్. తారకడ్ రాసిన కథ ఆధారంగా శ్రీనివాసన్ అబ్రోల్‌ స్క్రీన్‌ప్లే రాశారు. ఈ చిత్రంలో హకీమ్ షాజహాన్, హన్నా రెజీ కోషి, శరవణన్, సంపత్ రాజ్, దీపక్ పరంబోల్, అర్జున్ శ్యామ్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 19న ఈ చిత్రం మలయాళం భాషలో గ్రాండ్ గా విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్? బ్రేక్ ఈవెన్ టార్గెట్? 2వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..

మిరేజ్ చిత్రం బడ్జెట్?
ప్రముఖ మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ నుంచి ఇంట్రెస్టింగ్ చిత్రాలు వస్తుంటాయి. దృశ్యం, దృశ్యం 2, మోహన్ లాల్ నీరు వంటి సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారాయన. ఇకత తాజాగా మిరేజ్ అనే చిత్రంతో వచ్చారు. ఈ చిత్రానికి సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ, వినాయక్ ఎడిటింగ్, విష్ణు శ్యామ్ మ్యూజిక్ అందించారు. నాడ్ ఎస్ స్టూడియోస్, ఈ4 ఎక్స్పిరిమెంట్స్, సరెగమ, సెవెన్ 1 సెవెన్ ప్రొడక్షన్స్, బెడ్‌టైమ్ స్టోరీస్ బ్యానర్లపై నిర్మాతలు ముఖేష్ ఆర్ మెహతా, జతిన్ ఎం సేతి, సీవీ సారతి, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్ నిర్మించారు.

Mirage Day 2 Box Office Collections Worldwide

ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్ ఖర్చులన్నీ కలుపుకొని రూ.14 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక ఈ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ కంపెనీలు నిర్మించడం, ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ డైరెక్షన్ కావడంతో కాస్తా బజ్ క్రియేట్ అయ్యింది. రెండ్రోజుల కింద ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిరేజ్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.15 కోట్ల షేర్, రూ.30 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఓపెనింగ్ డే మిరేజ్ వసూళ్లు..
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలకు ప్రేక్షకులకు సాధారణంగా ఆసక్తి ఉంటుంది. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ఆడియెన్స్ మరింతగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. దీంతో మిరేజ్ విడుదలైన సందర్భంగా మొదటి రోజు మలయాళంలో రూ.1 కోటీ ఇండియా నెట్, రూ.2 కోట్ల గ్రాస వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

2వ రోజు కలెక్షన్లు..
సెప్టెంబర్ 20న శనివారం ఈ చిత్రానికి మరో రూ.1 కోటీ వరకు ఇండియా నెట్ వసూలైందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. దీంతో 2 రోజుల్లో సినిమాకు రూ.2 కోట్ల ఇండియా నెట్, రూ. 4 కోట్ల ఇండియా గ్రాస్ వసూలైంది. ఇక 3వ రోజు ఆదివారం ఎలాంటి వసూళ్లను సాధిస్తుందనేది చూడాలి. చిత్రంలోని మల్టిపుల్ ట్విస్ట్ లు, టర్స్న్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని రివ్యూలు కనిపించాయి. ఇలా ఈ చిత్రానికి మిక్డ్స్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫామ్ చేస్తుందనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X