Mirai Closing Collection: మిరాయ్ క్లోజింగ్ కలెక్షన్స్.. తేజ సజ్జా మూవీకి లాభమెంత? నష్టమెంత?

హనుమాన్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ నటించిన చిత్రం మిరాయ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఎన్నో హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిరాయ్‌లో తేజ సజ్జ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. ఈ నేపథ్యంలో మిరాయ్ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, ఓవరాల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? మిరాయ్‌కి లాభమెంత? నష్టమెంత? ఈ వివరాల్లోకి వెళితే..

మిరాయ్‌లో ఒకప్పటి అందాల నటి శ్రీయ సరన్ తొలిసారి తల్లి పాత్రలో, మంచు మనోజ్ ప్రతినాయక పాత్ర పోషించారు. జగపతి బాబు, జయరాం, దర్శకులు తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గౌరా హరి సంగీత దర్శకత్వం వహించగా.. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌తో పాటు సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్స్ మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్‌గా నాగేంద్ర తంగల వ్యవహరించారు.

Mirai Box Office Closing Collections Worldwide How much loss or profit for Teja Sajja s Movie

మిరాయ్ బడ్జెట్ ఎంత?
ఇతిహాసాలు, పురాణాలు కలయికగా సోషియో ఫాంటసి మూవీగా తెరకెక్కిన మిరాయిలో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌లకు పెద్ద మొత్తంలో వెచ్చించారు. నిర్మాణ విలువలకు ఎక్కడా రాజీ పడకపోవడంతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో మిరాయ్‌కి సుమారుగా 65 కోట్ల రూపాయలు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

మిరాయ్ ప్రీ రిలీజ్ బిజినెస్
తేజ సజ్జా ట్రాక్ రికార్డ్, టీజర్, ట్రైలర్ల కారణంగా మిరాయ్ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. మిరాయ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలకు, నైజాం 7 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 2.5 కోట్లు, కేరళ రైట్స్ 50 లక్షల రూపాయలు, హిందీ రైట్స్ 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. థియేట్రికల్, ఆడియో, శాటిలైట్, ఓటీటీ రైట్స్ కింద మొత్తంగా మిరాయ్ చిత్రానికి 85 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి 66 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని వాల్యూ నిర్దేశించారు.

మిరాయ్ కలెక్షన్స్
మిరాయ్‌కి తొలి వారం 65 కోట్ల రూపాయలు, రెండో వారం 19.4 కోట్ల రూపాయలు, మూడో వారం 7.5 కోట్ల రూపాయలు చొప్పున 94.17 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్స్, 110.64 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాలోనే 3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 26.62 కోట్ల రూపాయలు) రాబట్టింది. మిగిలిన గల్ఫ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో కలిపి మిరాయ్ చిత్రానికి 32.8 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి వరల్డ్ వైడ్‌గా 143.44 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో మిరాయ్ కలెక్షన్స్:
మిరాయ్ తెలుగు రాష్ట్రాల్లో తొలి వారం 50.71 కోట్ల రూపాయలు, రెండో వారం 15.93 కోట్ల రూపాయలు, మూడో వారం 6.74 కోట్ల రూపాయలు చొప్పున ఓవరాల్‌గా 75.49 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాల వారీగా మిరాయ్ వసూళ్లు పరిశీలిస్తే.. నైజాంలో 28 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 14 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8.86 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 7.70 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 4 కోట్ల రూపాయలు, గుంటూరులో 5.22 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 5.54 కోట్ల రూపాయలు, నెల్లూరులో 3 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది.

ఇండియాలోని రాష్ట్రాల వారీ మిరాయ్ వసూళ్లు పరిశీలిస్తే.. కర్ణాటకలో 11 కోట్ల రూపాయలు, తెలుగులో 75.49 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2.50 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షల రూపాయలు, హిందీలో 20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 32.8 కోట్ల రూపాయలు అందుకున్నట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

మిరాయ్‌కి లాభమెంత? నష్టమెంత?
మిరాయ్‌కి భారీ ఓపెనింగ్స్ రాబట్టగా .. తొలి వారమే 100 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టగా.. ఇదే ఊపులో హనుమాన్ బాక్సాఫీస్ రికార్డులను తేజా సజ్జా బద్ధలు కొడతాడని అనుకున్నారు. కానీ మధ్యలో ఓజీ, కాంతార చాప్టర్ 1 చిత్రాల ప్రభావం మిరాయ్ కలెక్షన్స్‌‌పై పడింది. దీంతో తేజ సజ్జా మూవీ వరల్డ్ వైడ్‌గా 150 కోట్ల లోపే పరిమితమైంది. ఈ సినిమా లాభాలను పరిశీలిస్తే.. 66 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ టార్గెట్‌కి గాను 144 కోట్ల వసూళ్లను రాబట్టి దాదాపు 80 కోట్ల లాభాలను అందించింది. తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయల టార్గెట్‌కు గాను 45 కోట్ల రూపాయల షేర్.. 75 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి.. దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా లాభాలను అందించింది.

నిర్మాతలు ఈ సినిమా కోసం దాదాపు 64 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించగా.. ఓవరాల్ బడ్జెట్ మీద మిరాయ్ దాదాపు 80 కోట్ల రూపాయలకు పైగా లాభాలను అందించింది. అయితే థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాతకు మరిన్ని లాభాలు అందాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X