Mirai Day 10 Box Office : 150 కోట్లకు చేరువగా మిరాయ్.. 10 రోజుల్లో సెన్సేషన్.. ఎన్ని కోట్లు వసూలైందంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో మిరాయ్ చిత్రం ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటించిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ విడుదలై ఇటు ప్రేక్షకుల నుంచి, అటు బాక్సాఫీస్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందనే వివరాల్లోకి వెళితే..
మిరాయ్ మూవీ బడ్జెట్..
ఈ సై-ఫై తేజా సజ్జా, రితికా నాయక్ హీరోహీరోయిన్లుగా, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్, గెటప్ శ్రీను ముఖ్య పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. మ్యూజిక్ గౌర హరి అందించగా, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ చూశారు. కార్తీక్ ఘట్టమనేనినే సినిమాటోగ్రఫీని అందించారు. ఇలా ఈ చిత్రానికి నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్ ఖర్చులన్నీ కలుపుకొని రూ.65 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్?
తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రాలో రూ.8 కోట్లు, నైజాంలో రూ.7 కోట్లు, సీడెడ్‌లో రూ.3 కోట్లు, కర్ణాటకలో రూ.2 కోట్లు, తమిళనాడులో రూ.2.5 కోట్లు, కేరళలో రూ.50 లక్షలు, హిందీలో రూ.10 కోట్లు, ఓవర్సీస్ నుంచి రూ.5 కోట్లు, నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచి రూ.50 కోట్లు కలుపుకొని మొత్తంగా రూ.85 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రావాలంటే.. రూ.32 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.64 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలని, వరల్డ్ వైడ్ గా రూ.130 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ నిపుణులు బ్రేక్ ఈవెన్ వాల్యూను నిర్ణయించారు.
మిరాయ్ 10 రోజుల కలెక్షన్లు..
ఓపెనింగ్ డే రూ.13 కోట్లు, 2వ రోజు రూ.15 కోట్లు, 3వ రోజు రూ.16.6 కోట్లు, 4వ రోజు రూ.6.4 కోట్లు, 5వ రోజు రూ.6 కోట్లు, 6వ రోజు రూ.4.75 కోట్లు, 7వ రోజు రూ.3.75 కోట్లు, 8వ రోజు రూ.275 కోట్లు, 9వ రోజు రూ.5.15 కోట్లు, 10వ రోజు రూ.6 కోట్లు ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణంకాలు తెలుపుతున్నాయి.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. రూ.150 కోట్లకు చేరువలో..
ఇప్పటి వరకు ఇండియా నెట్ రూ.79 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.105 కోట్లు, ఓవర్సీస్ లో రూ.30 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక లెక్కన 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.135 కోట్ల గ్రాస్‌ను వసూల్ చేసిందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. 2వ వారం పూర్తి అయ్యేలోపు ఈ చిత్రం రూ.150 క్లబ్ లో చేరనుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్టేట్ వైజ్‌గా కలెక్షన్లు..
10 రోజుల్లో మిరాయ్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏపీ+తెలంగాణ కలుపుకొని రూ.63.25 కోట్లు, కర్ణాటకలో రూ.9.30 కోట్లు, తమిళనాడులో రూ.2.06 కోట్లు, కేరళలో రూ.34 లక్షలు, ROI ద్వారా రూ.18 కోట్లు వసూల్ చేసిందని సాక్ నిక్ బాక్సాఫీస్ లెక్కలు తెలుపుతున్నాయి. ఇక ఈ చిత్రం 10వ రోజు వసూళ్లతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకోవడం విశేషం. ఇకపై లాభాల్లోకి రానుంది.


Click it and Unblock the Notifications











