Mirai Day 15 Collections: ఓజీతో మిరాయ్ భారీ పోటీ.. తేజా సజ్జా కెరీర్‌లో మరో రికార్డు.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?

తెలుగు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుస్థాయిలో వసూళ్లను రాబడుతున్నది. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో వరుస వైఫల్యాలు చోటు చేసుకొన్న నేపథ్యంలో మిరాయ్ సినిమాకు భారీగా కలెక్షన్లు రావడం ఊరటగా మారింది. తేజా సజ్జా హీరోగా రితిక నాయక్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజై బాక్సాఫీస వద్ద భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా 8వ రోజు అంచనా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

సామ్రాట్ అశోక చక్రవర్తి కాలం నాటి కథతో ఎపిక్ సోషియో ఫాంటసీగా, ఇతిహాసాలు, పురాణాల కీలక అంశాలుగా రూపొందిన మిరాయి చిత్రంలో భారీగా యాక్షన్ సీన్లు, వీఎఫ్ఎక్స్ వర్క్‌తో గ్రాండ్‌గా నిర్మించారు. అలాగే టాప్ స్టార్ కాస్ట్, టెక్నిషియన్స్ కూడా పనిచేయడం, అలాగే రాజీ లేకుండా ఖర్చు చేయడంతో బడ్జెట్ కూడా భారీగానే అయింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో టాప్ క్లాస్ టెక్నికాలిటీస్‌తో, రిచ్‌గా నిర్మించారు.

Mirai Day 15 Expected Box Office

మిరాయ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలకు, నైజాం 7 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 2.5 కోట్లు, కేరళ రైట్స్ 50 లక్షల రూపాయలు, హిందీ రైట్స్ 10 కోట్ల రూపాయలతో మొత్తంగా 33 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే 14వ రోజున ఓజీ సినిమా రిలీజ్ ఉండటంతో ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్లను భారీగా ఆ మూవీకి కేటాయించారు. దాంతో ఒక రోజు కలెక్షన్లు కొంత మేరకు తగ్గుముఖం పట్టాయి. అయితే 15వ రోజున ఈ సినిమా వసూళ్లు మళ్లీ ఊపందుకొనే ఛాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమాకు మూడో శుక్రవారం పాజిటివ్‌గా కనిపిస్తున్నది. ఓజీ పొటీని తట్టుకొని ఆ సినిమా ఓవర్ ఫ్లోస్‌ను క్యాష్ చేసుకొనేందుకు రెడీ అవుతున్నది.

ఇక మిరాయ్ కలక్షన్ల విషయానికి వస్తే.. తొలివారంలో భారీగా వసూళ్లను నమోదు చేసింది. ఫస్ట్ వీక్‌లో ఆంధ్రా, నైజాంలో కలిపి 52 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 7.5 కోట్లు, తమిళనాడులో 2 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 78 కోట్ల మొదటి వారం వసూలు చేసింది.

ఇక రెండో వారం కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్టాంగ్‌గా కనిపించింది. రెండో వారంలో ఆంధ్రా, నైజంలో 16.5 కోట్లు, కర్ణాటకలో 2.5 కోట్లు, తమిళనాడులో 50 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 19 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 38.5 కోట్ల రూపాయలు రాబట్టింది.

మిరాయ్ సినిమా ఇండియాలో తొలివారం 78 కోట్లు, రెండో వారంలో 38.5 కోట్లతో 116.5 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. తెలుగులో అత్యధికంగా 68 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను నమోదు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 32.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 149 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఇక 15వ రోజు ఈ సినిమా 1 కోటి రూపాయలు మేర వసూలు చేయవచ్చు. దాంతో ఈ చిత్రం 150 కోట్ల రూపాయలు మైలురాయిని దాటడం ఖాయమైంది. ఈ సినిమా ఇప్పటికే భారీ లాభాల్లోకి ప్రవేశించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X