Mirai Day 4 Collections: 100 కోట్లకు చేరువగా మిరాయ్.. 4వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మిరాయ్. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరోలు తేజా సజ్జా, మంచు మనోజ్, శ్రీయ సరన్ నటించిన ఈ చిత్రం పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ తొలిసారి తల్లి పాత్రలో, రితీక నాయక్ హీరోయిన్‌గా నటించారు. జగపతి బాబు, జయరాం, దర్శకులు తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 12వ తేదీన పాన్ ఇండియామూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.
మిరాయ్ సినిమా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు మ్యూజిక్ గౌరా హరి, సినిమాటోగ్రఫి కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్స్ మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల వ్యవహరించారు. ఈ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో టాప్ క్లాస్ టెక్నికాలిటీస్‌తో, రిచ్‌గా నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 35 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా, నైజాంలో తొలి రోజు 8.5 కోట్లు, రెండో రోజు 9 కోట్లు వసూలు చేసింది. సండే హాలీడే రోజున ఈ చిత్రం 9.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.గత మూడు రోజుల్లో ఈ చిత్రం నైజాంలో 6.5 కోట్లు, సీడెడ్‌లో 1.4 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.3 కోట్లు, తూరు గోదావరి జిల్లాలో 1 కోటి రూపాయలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 55 లక్షలు, గుంటూరులో 75 లక్షలు, కృష్ణా జిల్లాలో 73 లక్షలు, నెల్టూరులో 60 లక్షల రూపాయలు రాబట్టింది. ఈ చిత్రం మూడు రోజుల్లో 33 కోట్ల రూపాయల నెట్, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మిరాయ్ చిత్రం ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నది. ఈ చిత్రం ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3 రోజుల్లో 15 కోట్ల రూపాయలకుపైగానే వసూళ్లను సాధించింది. ఇంకా ఈ చిత్రం నార్త్ అమెరికాలో స్ట్రాంగ్‌గా ఉంది. ఇతర దేశాల్లో వసూళ్ల వివరాలు తెలియాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక కర్ణాటకలో ఈ చిత్రం 4.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.5 కోటి రూపాయలు, హిందీలో 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు, తెలుగులో 50 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో 81 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక ఈ చిత్రం నాలుగో రోజు కూడా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ మూవీ ఆంద్రా, తెలంగాణ, హిందీ, ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో కలిపి ఈ చిత్రం 5 కోట్ల నుంచి 6 రూపాయలు వరకు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 90 కోట్ల రూపాయలకు చేరువ కానున్నది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











