Mirai 100: మిరాయ్ బాక్సాఫీస్ సంచలనం.. తేజా సజ్జా రికార్డుల పరంపర.. 5 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మిరాయ్. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరోలు తేజా సజ్జా, మంచు మనోజ్, శ్రీయ సరన్ నటించిన ఈ చిత్రం పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ తొలిసారి తల్లి పాత్రలో, రితీక నాయక్ హీరోయిన్‌గా నటించారు. జగపతి బాబు, జయరాం, దర్శకులు తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 12వ తేదీన పాన్ ఇండియామూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.
మిరాయ్ సినిమా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు మ్యూజిక్ గౌరా హరి, సినిమాటోగ్రఫి కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్స్ మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల వ్యవహరించారు. ఈ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో టాప్ క్లాస్ టెక్నికాలిటీస్‌తో, రిచ్‌గా నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 35 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం దిశగా పరుగులు పెడుతున్నది. ఈ మూవీ సాధించిన రికార్డు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మిరాయ్ చిత్రం తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. దాంతో మొదటి రోజు నుంచే భారీగా వసూళ్లను సాధిస్తున్నది. తొలి రోజు 13 కోట్ల రూపాయలు, రెండో రోజు 15 కోట్ల రూపాయలు, మూడో రోజు 17 కోట్ల రూపాయలు, 4వ రోజు 6.5 కోట్ల రూపాయలు, 5వ రోజు 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియా వైడ్ 56 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది.
నార్త్ అమెరికాలో మిరాయ్ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను నమోదు చేస్తున్నది. హనుమాన్ మూవీని మించి కలెక్షన్లను రాబట్టే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా 2 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా సుమారుగా 5 మిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చనే అంచనా ట్రేడ్ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది.
మిరాయ్ చిత్రం గత 5 రోజులుగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ఈ చిత్రం అన్ని భాషల్లో ఘనంగా కలెక్షన్లు సాధిస్తున్నది. కన్నడలో 6 కోట్ల రూపాయలు, తెలుగులో 42 కోట్ల రూపాయలు, తమిళంలో 1.5 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షలు, హిందీలో 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 56 కోట్ల రూపాయల నెట్, 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 20 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా 10 కోట్ రూపాయల క్లబ్‌లో చేరింది.
మిరాయ్ చిత్రం కలెక్షన్ల పరంగానే కాకుండా ఫుట్ ఫాల్స్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమాకు ఇప్పటికే 1 లక్ష టికెట్లు అమ్ముడుపోయాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా స్ట్రాంగ్‌గా ఉండటం కారణంగా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా హనుమాన్ కలెక్షన్లను అధిగమిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











