Mirai Worldwide Business: మిరాయ్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. విడుదలకు ముందే ఎన్ని కోట్ల లాభమంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం మిరాయ్. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరోలు తేజా సజ్జా, మంచు మనోజ్, శ్రీయ సరన్ నటించిన ఈ చిత్రం పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ చిత్రానికి కృతి ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన పాన్ ఇండియామూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.
మిరాయ్ సినిమా విషయానికి వస్తే.. సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ తొలిసారి తల్లి పాత్రలో నటిస్తున్నారు. అఈ సినిమాకు మ్యూజిక్ గౌరా హరి, సినిమాటోగ్రఫి కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్స్ మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల వ్యవహరిస్తున్నారు. ప్రోమోలు, ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..

మిరాయ్ చిత్రం ఎపిక్ సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు భారీగా యాక్షన్ సీన్లు, అలాగే వీఎఫ్ఎక్స్ వర్క్ చేయించారు. అలాగే టాప్ స్టార్ కాస్ట్, టెక్నిషియన్స్ కూడా పనిచేశారు. అలాగే రాజీ లేకుండా ఖర్చు చేయడంతో ఈ సినిమా బడ్జెట్ భారీగానే అయింది. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక తేజా సజ్జా నిర్మించిన ఈ చిత్రానికి భారీగా హైప్ ఉండటంతో బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీగా డిమాండ్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అంతా కలిపి సుమారుగా 45 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని తెలిసింది. దాంతో ఈ సినిమా 75 శాతం రికవరీ సాధించింది.
ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలకు, నైజాం 7 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 2.5 కోట్లు, కేరళ రైట్స్ 50 లక్షల రూపాయలు, హిందీ రైట్స్ 10 కోట్ల రూపాయల మేర వాల్యూ కట్టినట్టు సమాచారం. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహర్, కేరళలో గోకుళం పిక్చర్స్, కర్ణాటకలో హోంబలే, తమిళంలో ఏజీఎస్ రిలీజ్ చేస్తుండటం తెలిసిందే. ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమాను శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమా అమెరికా రైట్స్ సుమారుగా 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.
మిరాయ్ సినిమా మొత్తంగా ఈ సినిమా 38 కోట్ల రూపాయల మేర వాల్యూ జరిగింది. ఇంకా ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ ఇతర దేశాల రైట్స్ వివరాలు తెలియాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓటీటీతో కలిపి 83 కోట్ల రూపాయల మేర బిజినెస్ నమోదైంది. మ్యూజిక్ ఇతర రైట్స్‌తో కలిపి ఈ సినిమా రిలీజ్‌కు ముందే సుమారుగా 30 కోట్లకుపైగా టేబుల్ ప్రాఫిట్ నిర్మాత విశ్వ ప్రసాద్‌కు లభించింది అనే వార్త ట్రేడ్ వర్గాల్లో వైరల్ అయింది. ఇక ఈ సినిమా థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 45 కోట్ల రూపాయల షేర్.. 90 కోట్ల రూపాయలకుపైగా గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది అని పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











