ప్రభాస్ ‘మిర్చి’ ఫస్ట్ డే కలెక్షన్స్
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో అదర గొట్టింది. ముఖ్యంగా ఈచిత్రం నైజాం ఏరియాలో సరికొత్త వసూళ్లు రాబట్టింది. నైజాం ఏరియాలో ఈచిత్రం దాదాపు రెండున్నర కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో విడుదలైన తెలుగు సినిమాలకు ఈ రేంజిలో కలెక్షన్ రావడం విశేషమే అంటున్నారంతా.
ట్రేడ్ వర్గాల నుంచి అందిన వివరాల ప్రకారం..'మిర్చి'ఫస్ట్ డే షేర్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. అయితే ఇవి అధికారిక వివరాలు మాత్రం కాదు. అంచనాలు మాత్రమే.
నైజాం - 2.48 కోట్లు
సీడెడ్ - 1.36 కోట్లు
వైజాగ్- 54 లక్షలు
వెస్ట్ గోదావరి - 54 లక్షలు
ఈస్ట్ గోదావరి - 64 లక్షలు
గుంటూరు- 63 లక్షలు
కృష్ణ - 36 లక్షలు
నెల్లూరు - 30 లక్షలు
మొత్త ఫస్ట్ డే ఏపీ షేర్: రూ. 6. 85 కోట్లు
కర్నాటకలో: 28 లక్షలు
రెస్టాఫ్ ఇండియా: 14 లక్షలు
ఇండియా టోటల్: 7.27 కోట్లు
కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా చేయగా, యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీసు వద్ద ఈచిత్రం ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











