‘మిర్చి’ బాలీవుడ్ రీమేకే ఖరారు...హీరో ఎవరంటే
హైదరాబాద్ : ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రం రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మిర్చి చిత్రం ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బాలీవుడ్ రీమేక్ రైట్స్ ఓ రేంజిలో అమ్ముడయ్యాయని సమాచారం. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఈ రైట్స ని నిర్మాతల నుంచి రీసెంట్ గా కొనుకోలు చేసినట్లు వినికిడి. ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకడు చేతిలో ఈ చిత్రాన్ని పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
'మిర్చి' చిత్రం ద్వారా కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా చేయగా, యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని నిర్మించారు. తొలి సినిమా దర్శకత్వంలోనే విజయం సాధించిన కొరటాల శివకు ఇప్పటికే ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి త్వరలో భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కొరటాల శివతో సినిమా చేయబోతున్నారు. అలాగే మహేష్ సైతం కొరటాల శివ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











