13 Years For Mirchi: ప్రభాస్- అనుష్కల కెరీర్‌లో గేమ్ ఛేంజర్‌గా... మిర్చి టోటల్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

మిర్చి.. ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్‌ కెరీర్‌కు ఈ సినిమా కొత్త ఊపిరి ఊదుంది. మాస్, యాక్షన్ మూవీలతో మూసలో వెళ్తున్న ప్రభాస్‌ను మిర్చి చిత్రం కొత్తగా చూపించింది. ప్రేమిద్దాం బ్రో.. పోయేదేముంది, కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ వంటి డైలాగ్స్‌తో ప్రభాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. లవ్, రొమాన్స్, యాక్షన్, ఫ్యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో వచ్చిన మిర్చి చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రభాస్ వన్ మేన్ షో, అనుష్క, రిచా గంగోపాధ్యాయల అందాలు, కొరటాల శివ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ పాటలు మిర్చిని ఎక్కడో నిలబెట్టాయి. 2013 ఫిబ్రవరి 8న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. ఈరోజుతో 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మిర్చి మూవీ విశేషాలు ఒకసారి పరిశీలిస్తే..

13 ఏళ్ల మిర్చి
మిర్చి మూవీతో అప్పటి వరకు రైటర్‌గా ఉన్న కొరటాల శివ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకుని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరిగా నిలిచారు. ప్రభాస్ - అనుష్కల జోడీ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ స్టైలీష్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించారు. అప్పటి వరకు రఫ్ లుక్‌లో కనిపించిన డార్లింగ్... మిర్చిలో ఫార్మల్ డ్రెస్‌లో కనిపించి అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచారు. ఇందులోని బార్బీగాళ్, మిర్చి మిర్చి మిర్చి, పండగల దిగివచ్చావు సాంగ్స్ చార్ట్ బస్ట్‌గా నిలిచాయి. ఈ మూవీ తర్వాతే ప్రభాస్‌కి బాహబలి లాంటి పాన్ ఇండియా మూవీలో అవకాశం దక్కింది. అలాగే నేటికీ మిర్చి సినిమా ప్రభాస్‌కు, ఆయన అభిమానులకు ప్రత్యేకం. మిర్చి సినిమా 13 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? థియేట్రికల్‌ రన్‌లో ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో పరిశీలిస్తే...

Mirchi Movie Total Collections Worldwide Prabhas and Koratala Siva s Movie Budget Overal Collection

మిర్చి తారాగణం
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వీ వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటిలు సంయుక్తంగా మిర్చి సినిమాను నిర్మించారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, సంపత్ రాజ్, ఆదిత్య మీనన్, నాగినీడు, బెనర్జీ, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. మది సినిమాటోగ్రాఫర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు.

మిర్చి బడ్జెట్ అండ్ బ్రేక్‌ఈవెన్ టార్గెట్
నటీనటులు సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలు, ప్రొడక్షన్ కాస్ట్ కలిపి మిర్చి చిత్రానికి 30 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్‌, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో మిర్చి చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. మిర్చి ఓవర్సీస్ రైట్స్ అప్పట్లో 2 కోట్ల రూపాయలకు గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ దక్కించుకుంది. అలాగే ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా 6 కోట్ల రూపాయలు వెచ్చించి కైవసం చేసుకుంది. ఆడియో హక్కుల కింద మరో 4 కోట్ల రూపాయలు, హిందీ శాటిలైట్ రైట్స్ 2.75 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. మొత్తంగా మిర్చికి వరల్డ్ వైడ్‌గా 31 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 32 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 64 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

మిర్చి కలెక్షన్స్
మిర్చి చిత్రం తొలి రోజు 7.86 కోట్ల రూపాయల భారీ ఓపెనింగ్స్ సాధించింది. తొలిరోజు నుంచే పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఆంధ్రా, నైజాంలలో అ సినిమా 64.30 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 7.80 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 4.30 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 4.60 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 87 కోట్ల రూపాయల గ్రాస్.. 47.70 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో మిర్చి కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాంలో 15.11 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 7.51 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4.20 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 2.90 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.65 కోట్ల రూపాయలు, గుంటూరులో 3.71 కోట్ల రూపాయలు, కృష్ణాలో 2.75 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.67 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. తద్వారా 32 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్‌కు గాను 47 కోట్ల రూపాయలకు పైగా రాబట్టి.. 16 కోట్ల రూపాయలకు పైగా లాభాలను అందించింది. అలా ఆ ఏడాది భారీ హిట్‌గా, ప్రభాస్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది మిర్చి.

More from Filmibeat

Read more about: prabhas mirchi box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X