Miss Shetty Mr Polishetty Collections:రూ. 13.50కోట్ల సినిమా.. 10 రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే ..
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమా తర్వాత అనుష్క శెట్టితో కలిసి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్టు టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి యూత్ వరకు అందరూ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. మరి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 10 రోజుల రిపోర్టును మీరే చూడండి!
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా మహేశ్ బాబు పీ తెరకెక్కించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఈ క్రేజీ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో నటించారు.

యూత్‌ఫుల్ కాన్సెప్టుతో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ రూ. 12.50 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. దీంతో ఈ చిత్రం 800 థియేటర్లలో ఎంతో గ్రాండ్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదల అయింది.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి 10 రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే... తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.35 కోట్లు, రెండో రోజురూ.1.21 కోట్లు, 3వ రోజు రూ.2.08కోట్లు, 4వ రోజు రూ.2.44 కోట్లు, 5వ రోజు రూ.1.08 కోట్లు, 6వ రోజు రూ.74 లక్షలు, 7వ రోజు రూ.60లక్షలు, 8వ రోజు రూ.44 లక్షలు, 9రోజు రూ.40లక్షలు, 10వ రోజు రూ. 69 లక్షలు రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.11.03 షేర్ (రూ.19.45 గ్రాస్) రాబట్టింది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ వివరాలకు వస్తే... నైజాం రూ.34 లక్షలు, సీడెడ్ రూ. 7లక్షలు, ఆంధ్రా రూ.28 లక్షలు రాబట్టగా.. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 0.69 కోట్లు షేర్ (రూ.1.20 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరిశీలిస్తే... నైజాం రూ.6.02 కోట్లు, సీడెడ్ రూ.1.00 కోట్లు, ఆంధ్రా రూ. 4.01 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.11.03 కోట్ల షేర్(రూ.19.45కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 1.50 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో రూ. 6.85కోట్లు వసూలు చేసింది. మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ19.38 కోట్ల షేర్(37.40CR~ గ్రాస్) వసూలు చేసింది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మొదటిరోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 3.00కోట్ల షేర్ (రూ.5.95 కోట్ల గ్రాస్), 2వ రోజు కలెక్షన్లు రూ.2.26 కోట్ల షేర్ (రూ.4.55కోట్ల~ గ్రాస్), 3వ రోజు కలెక్షన్లు రూ.3.58కోట్ల షేర్ (రూ.6.70కోట్ల~ గ్రాస్), 4వ రోజు కలెక్షన్లు రూ.4.36 కోట్ల షేర్ (రూ.8.45కోట్ల~ గ్రాస్), 5వ రోజు రూ.1.48కోట్లు షేర్ (రూ.2.80కోట్లు~ గ్రాస్), 6వ రోజురూ.1.21కోట్లు షేర్ (రూ.2.35కోట్లు గ్రాస్),7వ రోజురూ. 0.86కోట్లు షేర్ (రూ.1.65కోట్లు~ గ్రాస్), 8వ రోజు రూ.0.64కోట్లు షేర్ (రూ.1.20కోట్లు~ గ్రాస్), 9వ రోజు రూ. 0.77కోట్ల షేర్ (రూ.1.45కోట్లు గ్రాస్), 10వ రోజు రూ.1.22కోట్ల షేర్ (రూ.2.30కోట్లు~ గ్రాస్) వసూలు చేసింది.
సినిమా మొత్తం వ్యాపారం(విలువ) రూ.12.50 కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ రూ. 13.50కోట్లుగా నమోదు అయింది. సినిమా మొత్తం లాభం రూ.5.88 కోట్ల లాభంతో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.


Click it and Unblock the Notifications











