Miss Shetty Mr Polishetty Collections: 13వ రోజు ఢమాల్.. మొత్తంగా అన్ని కోట్లు.. లాభాలు చూస్తే మెంటలే
తెలుగు చిత్ర పరిశ్రమలో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తున్న యంగ్ హీరోలు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అందులో వెరీ టాలెంటెడ్ గాయ్ నవీన్ పోలిశెట్టి ఒకడు. ఆరంభం నుంచే తనదైన చిత్రాలతో సత్తా చాటుతోన్న అతడు.. హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు.
ఈ జోష్‌లోనే ఇటీవలే నవీన్ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో వచ్చాడు. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా దక్కింది. అయితే, క్రమంగా డౌన్ అవుతోంది. మరి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 13 రోజుల రిపోర్టును మీరే చూడండి మరి!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రాక: నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో జంటగా నటించిన సినిమానే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. మహేశ్ బాబు పీ తీసిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రలను పోషించారు.

ఈ మూవీకి బిజినెస్ ఎంతంటే: యువతకు కనెక్ట్ అయ్యే కంటెంట్‌తో వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని తెలిసింది. ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ రూ. 12.50 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. దీంతో ఈ చిత్రం 800 థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

13వ రోజు ఎంత వసూలైందంటే: ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్న నవీన్ పోలిశెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందనే వచ్చింది. 13వ రోజు వర్కింగ్ డే అవడంతో ఇది బాగా డౌన్ అయిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఆంధ్రాలో రూ. 16 లక్షలతో కలిపి.. 13వ రోజు ఈ మూవీ రూ. 40 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్ రాబట్టింది.

13 రోజులకూ కలిపి ఎంతంటే?: నవీన్ పోలిశెట్టి - అనుష్క శెట్టి జోడీగా నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రానికి 13 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలోనే స్పందనే లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 6.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.15 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.65 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి 13 రోజుల్లో రూ. 12.58 కోట్లు షేర్, రూ. 22.35 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 13 రోజుల్లో రూ. 12.58 కోట్లు షేర్ వసూలు చేసి సత్తా చాటుకున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.72 షేర్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.00 కోట్లు షేర్, రూ. 42.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లోనే దీనికి రూ. 22.00 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 8.50 కోట్లు లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











