Miss Shetty Mr Polishetty Collections: 15వ రోజు లక్షల్లో.. మొత్తంగా కోట్ల వర్షం.. 45 లక్షలు వస్తే!
తెలుగు చిత్ర పరిశ్రమలోని యంగ్ హీరోల్లో అతి తక్కువ మంది మాత్రమే మంచి సక్సెస్ రేటుతో సత్తా చాటుతూ మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. అందులో నవీన్ పోలిశెట్టి ఒకడు. ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. ఇటీవలే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రేజీ కాన్సెప్టుతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వస్తూనే ఉంది. మూడో వారం కూడా డీసెంట్ వసూళ్లతో స్టార్ట్ అయింది. మరి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 15 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!
అనుష్క, నవీన్ కాంబినేషన్‌లో:అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‌లో రూపొందిన ఫన్ మూవీనే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. మహేశ్ బాబు పీ తీసిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రలను పోషించారు.

ఈ మూవీకి బిజినెస్ ఎంతంటే:యువతకు కనెక్ట్ అయ్యే కథాంశంతో వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని తెలిసింది. ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ రూ. 12.50 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. దీంతో ఈ చిత్రం 800 థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

15వ రోజు ఎంత వచ్చిందంటే:ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తోన్న నవీన్ పోలిశెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందనే వచ్చింది. 15వ రోజూ వర్కింగ్ డే అవడంతో ఇది బాగా డౌన్ అయింది. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఆంధ్రాలో రూ. 10 లక్షలతో కలిపి.. 15వ రోజు ఈ మూవీ రూ. 27 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ రాబట్టింది.

15 రోజులకూ కలిపి ఎంతంటే?:నవీన్ పోలిశెట్టి - అనుష్క శెట్టి జంటగా చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రానికి 15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలోనే స్పందనే లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 7.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.21 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.85 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి 15 రోజుల్లో రూ. 13.16 కోట్లు షేర్, రూ. 23.45 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:ఆంధ్రా, తెలంగాణలో 15 రోజుల్లో రూ. 13.16 కోట్లు షేర్ వసూలు చేసి సత్తా చాటుకున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.79 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.10 షేర్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.05 కోట్లు షేర్, రూ. 43.90 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లోనే దీనికి రూ. 23.05 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 9.55 కోట్లు లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











