Miss Shetty Mr Polishetty Collections: 16వ రోజు షాక్.. ఏకంగా అన్ని కోట్లతో.. మరో రికార్డుకు చేరువ
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కాన్సెప్టులతో సినిమాలు వస్తున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటున్నాయి. అందులో ఇటీవలే విడుదలైన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఒకటి. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఆరంభం నుంచీ అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటుతోంది. అయితే, కొద్ది రోజులుగా ఇది క్రమంగా డౌన్ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓ రికార్డుకు చేరువగా వచ్చింది. మరి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 16 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!
యూత్‌ఫుల్ స్టోరీతో వచ్చింది : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా చేసిన యూత్‌ఫుల్ మూవీనే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. మహేశ్ బాబు పీ తీసిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో కనిపించారు.

ఈ మూవీకి బిజినెస్ ఎంతంటే : క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని తెలిసింది. ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ రూ. 12.50 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. దీంతో ఈ చిత్రాన్ని 800 థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసుకున్నారు.
16వ రోజు ఎంత వచ్చిందంటే : విభిన్నమైన కాన్సెప్టుతో టాలెంటెడ్ గాయ్ నవీన్ పోలిశెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందనే వచ్చింది. 16వ రోజూ వర్కింగ్ డే అవడంతో ఇది మరింత పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఆంధ్రాలో రూ. 7 లక్షలతో కలిపి.. 16వ రోజు ఈ మూవీ రూ. 20 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వచ్చింది.

16 రోజులకూ కలిపి ఎంతంటే : నవీన్ పోలిశెట్టి - అనుష్క శెట్టి జంటగా చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రానికి 16 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలోనే స్పందనే లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 7.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.90 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి 16 రోజుల్లో రూ. 13.33 కోట్లు షేర్, రూ. 23.90 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది : ఆంధ్రా, తెలంగాణలో 16 రోజుల్లో రూ. 13.33 కోట్లు షేర్ వసూలు చేసి సత్తా చాటుకున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.81 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.09 షేర్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.23 కోట్లు షేర్, రూ. 44.95 కోట్లు గ్రాస్ రాబట్టింది.
టార్గెట్ ఇలా.. లాభం ఎంత : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లోనే దీనికి రూ. 23.23 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 9.93 కోట్లు లాభాలతో పది కోట్ల లాభాల రికార్డుకు చేరువైంది.


Click it and Unblock the Notifications











