Miss Shetty Mr Polishetty Collections: 13 కోట్ల సినిమా.. వారంలో ఊహించని విధంగా.. లాభం ఎంతో తెలిస్తే!

తెలుగు సినీ రంగంలో ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే విశేషమైన ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నారు. అలాంటి వారిలో నవీన్ పోలిశెట్టి ఒకరు. కొంత కాలంగా వరుస హిట్లతో దూసుకుపోతోన్న అతడు.. ఇటీవలే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో వచ్చాడు. యూత్‌ఫుల్ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ కూడా భారీగానే దక్కింది. దీంతో దీనికి కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. మరి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' బాక్సాఫీస్ రిపోర్టు మీరే చూడండి!

ఊహించని కాంబోలో వచ్చింది:నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన క్రేజీ మూవీనే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. మహేశ్ బాబు పీ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో కనిపించారు.

Miss Shetty Mr Polishetty Movie 1st Week Official Box Office Collections

ఈ మూవీకి బిజినెస్ ఎంతంటే:యూత్‌కు నచ్చే కాన్సెప్టుతో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం క్రేజీ కాన్సెప్టుతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని తెలిసింది. ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ రూ. 12.50 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. దీంతో ఈ చిత్రం 800 థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.

Miss Shetty Mr Polishetty Movie 1st Week Official Box Office Collections

7వ రోజు ఎంత వసూలైందంటే:జాతి రత్నాలు తర్వాత నవీన్ నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందనే వచ్చింది. ఏడో రోజు వర్కింగ్ డే కావడంతో దీనికి రెస్పాన్స్ మరింతగా తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఆంధ్రాలో రూ. 24 లక్షలతో కలిపి.. ఏడో రోజు ఈ మూవీ రూ. 60 లక్షలు షేర్, రూ. 1.05 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Miss Shetty Mr Polishetty Movie 1st Week Official Box Office Collections

7 రోజులకూ కలిపి ఎంతంటే?:ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రానికి ఏడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలోనే స్పందనే లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 5.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 85 లక్షలు, ఆంధ్రాలో రూ. 3.39 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి 7 రోజుల్లో రూ. 9.50 కోట్లు షేర్, రూ. 16.75 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:7 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 9.50 కోట్లు షేర్ వసూలు చేసి సత్తా చాటుకున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.95 షేర్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.75 కోట్లు షేర్, రూ. 32.45 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Miss Shetty Mr Polishetty Movie 1st Week Official Box Office Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఏడు రోజుల్లోనే దీనికి రూ. 16.75 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.25 కోట్లు లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X