Miss Shetty Mr Polishetty Collections: 2వ రోజూ సూపర్.. అక్కడ టార్గెట్ ఫినీష్.. అప్పుడే అన్ని కోట్లా!
టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో కొత్త కొత్త కాన్సెప్టుతో సినిమాలు వస్తున్నాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ఆరంభం నుంచే హైలైట్ అవుతున్నాయి. అలాంటి వాటిలో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ఒకటి.
ప్రయోగాత్మక యూత్‌ఫుల్ కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే ఓపెనింగ్స్ భారీగా లభించాయి. అదే ఊపు రెండో రోజు కూడా కంటిన్యూ అయింది. ఫలితంగా ఈ చిత్రం మంచి హోల్ట్ చేసింది. మరి ఈ మూవీ రెండు రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దామా!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రాక: నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రమే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. మహేశ్ బాబు పీ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో కనిపించారు.

ఈ మూవీకి బిజినెస్ ఎంతంటే: క్రేజీ కాంబినేషన్‌లో డిఫరెంట్ స్టోరీలైన్‌తో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం క్రేజీ కాన్సెప్టుతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని తెలిసింది. ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ రూ. 12.50 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. దీంతో ఈ చిత్రం 800 థియేటర్లలో రిలీజ్ అయింది.

రెండో రోజు ఎంత వసూలైంది: ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కూడా మంచి స్పందనే వచ్చింది. 'జవాన్', 'ఖుషి' మూవీల నుంచి పోటీ ఉన్నా ఇది చక్కగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 68 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఆంధ్రాలో రూ. 42 లక్షలతో కలిపి రూ. 1.21 కోట్లు షేర్, రూ. 1.95 కోట్లు గ్రాస్ రాబట్టింది.

2 రోజులకూ కలిపి ఎంతంటే?: విభిన్నమైన సబ్జెక్టుతో నవీన్ పోలిశెట్టి - అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రానికి రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.48 కోట్లు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఆంధ్రాలో రూ. 87 లక్షలు వసూలు అయ్యాయి. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.56 కోట్లు షేర్, రూ. 4.60 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: 2 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 2.56 కోట్లు షేర్ రాబట్టిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్‌లో 550K డాలర్లు అంటే రూ. 2.40 షేర్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.26 కోట్లు షేర్, రూ. 10.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజుల్లోనే దీనికి రూ. 5.26 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో రూ. 8.24 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











