Miss Shetty Mr Polishetty Collections: 12.50 కోట్ల సినిమా సంచలనం.. ప్రభాస్ ఫ్రెండ్‌కు కోట్ల లాభం

ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కంటెంట్‌తో ఎన్నో క్రేజీ మూవీలు వస్తున్నాయి. అందులో నవీన్ పోలిశెట్టి - అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ఒకటి. ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆరంభం నుంచీ ప్రేక్షకుల స్పందనను అందుకుంటూ ముందుకు వెళ్తోంది. తద్వారా దీనికి డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి. ఇలా ఈ సినిమా రెండు వారాల్లో అదిరిపోయే కలెక్షన్లతో సత్తా చాటుకుంది. ఈ నేపథ్యంలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ 14 రోజుల్లో ఏ మేర రాణించిందో మీరు కూడా చూసేయండి మరి!

మిస్ అండ్ మిస్టర్ వచ్చారు:నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి కలిసి నటించిన ఫన్ ఎంటర్‌టైనరే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. మహేశ్ బాబు పీ తీసిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో కనిపించారు.

Miss Shetty Mr Polishetty Movie 2 Weeks Official Box Office Collections

ఈ మూవీకి బిజినెస్ ఎంతంటే:యూత్‌ను ఆకట్టుకునే అంశంతో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని తెలిసింది. ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ రూ. 12.50 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. దీంతో ఈ చిత్రం 800 థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది.

Miss Shetty Mr Polishetty Movie 2 Weeks Official Box Office Collections

14వ రోజు ఎంత వసూలైందంటే:వరుస హిట్లతో సత్తా చాటుతోన్న నవీన్ పోలిశెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందనే వచ్చింది. 14వ రోజు వర్కింగ్ డే అవడంతో ఇది ఇంకాస్త డౌన్ అయిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఆంధ్రాలో రూ. 12 లక్షలతో కలిపి.. 14వ రోజు ఈ మూవీ రూ. 32 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ రాబట్టింది.

Miss Shetty Mr Polishetty Movie 2 Weeks Official Box Office Collections

14 రోజులకూ కలిపి ఎంతంటే?:నవీన్ పోలిశెట్టి - అనుష్క శెట్టి జంటగా చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రానికి 14 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలోనే స్పందనే లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 6.94 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.19 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.77 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి 14 రోజుల్లో రూ. 12.90 కోట్లు షేర్, రూ. 22.95 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Miss Shetty Mr Polishetty Movie 2 Weeks Official Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:ఏపీ, తెలంగాణలో 14 రోజుల్లో రూ. 12.90 కోట్లు షేర్ వసూలు చేసి సత్తా చాటుకున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.85 షేర్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.50 కోట్లు షేర్, రూ. 43.30 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Miss Shetty Mr Polishetty Movie 2 Weeks Official Box Office Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజుల్లోనే దీనికి రూ. 22.50 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 9.00 కోట్లు లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X