Miss Shetty Mr Polishetty Collections: 3వ రోజు మాస్ హిట్టింగ్.. ఏకంగా అన్ని కోట్లు.. ఆ దేశంలో సంచలనం
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకడు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. 'జాతి రత్నాలు'తో బ్లాక్ బస్టర్‌ను కొట్టాడు. ఈ ఊపులోనే ఇప్పుడు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో వచ్చాడు.
చాలా గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించిన చిత్రం కావడంతో ఇది భారీ హైప్ ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే మంచి టాక్, రెస్పాన్స్‌ను అందుకుంది. మూడో రోజైతే కలెక్షన్లు కుమ్మేసింది. మరి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

క్రేజీగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి: నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన క్రేజీ మూవీనే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. మహేశ్ బాబు పీ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రలు చేశారు.

ఈ మూవీకి బిజినెస్ ఎంతంటే: క్రేజీ స్టోరీలైన్‌తో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం క్రేజీ కాన్సెప్టుతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని తెలిసింది. ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ రూ. 12.50 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. దీంతో ఈ చిత్రం 800 థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది.

మూడో రోజు ఎంత వసూలైంది: ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందనే వచ్చింది. ముఖ్యంగా రెండో శనివారం సెలవు దినం కావడంతో రెస్పాన్స్ భారీగా పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 1.34 కోట్లు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఆంధ్రాలో రూ. 58 లక్షలతో కలిపి.. రెండో రోజు రూ. 2.08 కోట్లు షేర్, రూ. 3.65 కోట్లు గ్రాస్ రాబట్టింది.
3 రోజులకూ కలిపి ఎంతంటే?: నవీన్ పోలిశెట్టి - అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రానికి మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.82 కోట్లు, సీడెడ్‌లో రూ. 37 లక్షలు, ఆంధ్రాలో రూ. 1.45 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి 3 రోజుల్లో రూ. 4.64 కోట్లు షేర్, రూ. 8.45 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: 3 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 4.64 కోట్లు షేర్ రాబట్టిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో 800K డాలర్లు అంటే రూ. 3.70 షేర్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.84 కోట్లు షేర్, రూ. 17.20 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజుల్లోనే దీనికి రూ. 8.84 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో రూ. 4.66 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

ఆ దేశంలో సంచలన వసూళ్లు: నవీన్ పోలిశెట్టి హీరోగా.. అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకు ఓవర్సీస్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం మూడు రోజుల్లోనే 800K డాలర్లు వసూలు చేసింది. తద్వారా ఒక మిలియన్ డాలర్ల మార్కును చేరేందుకు దూసుకుపోతోంది. ఆదివారమే ఈ చిత్రం ఆ మైల్‌స్టోన్‌ను చేరే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











