Miss Shetty Mr Polishetty Collections: 4వ రోజూ ఊచకోతే.. అప్పుడే అన్ని కోట్లు.. ఓవర్సీస్‌లో రికార్డు

టాలీవుడ్‌లో వచ్చే కొన్ని కాంబినేషన్లు ఆరంభం నుంచే హైప్‌ను ఏర్పరచుకుంటాయి. తద్వారా ఆయా సినిమాలపై అంచనాలు భారీగా నెలకొంటూ ఉంటాయి. అలాంటి వాటిలోనే నవీన్ పోలిశెట్టి - అనుష్క శెట్టి కలయిక ఒకటి. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. విభిన్నమైన సబ్జెక్టుతో రూపొందిన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. సండే కూడా ఈ మూవీ సత్తా చాటింది. మరి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 4 రోజుల రిపోర్టును మీరే చూడండి మరి!

క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన మూవీ:నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన క్రేజీ కాన్సెప్టు మూవీనే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. మహేశ్ బాబు పీ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో కనిపించారు.

Miss Shetty Mr Polishetty Movie 4 Days Official Box Office Collections

ఈ మూవీకి బిజినెస్ ఎంతంటే:విభిన్నమైన సబ్జెక్టుతో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం క్రేజీ కాన్సెప్టుతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని తెలిసింది. ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ రూ. 12.50 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. దీంతో ఈ చిత్రం 800 థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసుకున్నారు.

4వ రోజు ఎంత వసూలైందంటే:కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందనే వచ్చింది. ముఖ్యంగా 4వ రోజు హాలీడే కావడంతో రెస్పాన్స్ మరింతగా పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 1.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 28 లక్షలు, ఆంధ్రాలో రూ. 96 లక్షలతో కలిపి.. నాలుగో రోజు రూ. 2.44 కోట్లు షేర్, రూ. 4.25 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Miss Shetty Mr Polishetty Movie 4 Days Official Box Office Collections

4 రోజులకూ కలిపి ఎంతంటే?:నవీన్ పోలిశెట్టి - అనుష్క శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రానికి నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.41 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి 4 రోజుల్లో రూ. 7.08 కోట్లు షేర్, రూ. 12.55 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Miss Shetty Mr Polishetty Movie 4 Days Official Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 7.08 కోట్లు షేర్ వసూలు చేసి సత్తా చాటుకున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.02 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.10 షేర్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.20 కోట్లు షేర్, రూ. 25.65 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Miss Shetty Mr Polishetty Movie 4 Days Official Box Office Collections

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?:'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లుగా నమోదైంది. ఇక, నాలుగు రోజుల్లోనే దీనికి రూ. 13.20 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో రూ. 30 లక్షలు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Miss Shetty Mr Polishetty Movie 4 Days Official Box Office Collections

ఓవర్సీస్‌లో రికార్డు నమోదు:నవీన్ పోలిశెట్టి.. అనుష్క శెట్టి జంటగా నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకు ఓవర్సీస్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తద్వారా ఈ చిత్రం ఆ మైల్‌స్టోన్‌ను చేరి రికార్డు నమోదు చేసింది. అదే సమయంలో ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు కూడా చేరువగా వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X