Miss Shetty Mr Polishetty Collections: 5వ రోజూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం.. ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా.. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఇక ఈ సినిమా ఈ సెప్టెంబర్ 7న జవాన్ సినిమాతో పోటీగా థియేటర్లోకి వచ్చింది. ఇక మొదటి షో నుంచే ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వర్కిండే లోనూ ఈ మూవీ సత్తా చాటింది. మరి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 5 రోజుల రిపోర్టును మీరే చూడండి మరి!

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన క్రేజీ కాన్సెప్టు మూవీనే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. మహేశ్ బాబు పీ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో కనిపించారు.

Miss Shetty Mr Polishetty Movie 5 Days Official Box Office Collections

విభిన్నమైన సబ్జెక్టుతో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం క్రేజీ కాన్సెప్టుతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని తెలిసింది. ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ రూ. 12.50 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. దీంతో ఈ చిత్రం 800 థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసుకున్నారు.

Miss Shetty Mr Polishetty Movie 5 Days Official Box Office Collections

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి 5 రోజుల కలెక్షన్స్ ఒకసారి గమనిస్తే... తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.35కోట్లు, రెండో రోజు రూ.1.21 కోట్లు, మూడో రోజు రూ.2.08కోట్లు, నాలుగవ రోజు.. రూ.2.44కోట్లు, 5వ రోజు రూ.1.08 కోట్లు రాబట్టింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ8.16కోట్లు షేర్ రాబట్టగా...రూ.14.40 గ్రాస్ రాబట్టింది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డే తెలుగు రాష్టాల్లో 5వరోజు కలెక్షన్స్ గమనిస్తే... నైజాం రూ. 55లక్షలు, సీడెడ్ రూ. 9లక్షలు, ఆంధ్రాలో 44 లక్షలు, తెలంగాణ ఏపీ వ్యాప్తంగా మొత్తంగా 5వ రోజు రూ. 1.08కోట్ల షేర్ రాబట్టగా... రూ.1.85కోట్ల గ్రాస్ రాపట్టింది.

Miss Shetty Mr Polishetty Movie 5 Days Official Box Office Collections

ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే... నైజాం: 4.57 కోట్లు రాబట్టగా.. సీడెడ్ రూ. 74లక్షలు రాబట్టింది. ఇక ఆంధ్రా రూ.2.85 కోట్లు రాబట్టగా... తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.8.16 షేర్ వసూలు చేసింది. ఇక రూ.14.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని రూ.1.16కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లోనూ ఈ సినిమా 5 రోజుల్లో 5.36 కోట్లు రాబట్టింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రూ.14.68 కోట్లు షేర్ వసూలు చేయగా... రూ.28.45కోట్లగ్రాస్ రాబట్టింది.

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రూ.3.00 షేర్, రూ.5.95 కోట్ల గ్రాస్ రాబట్టగా.. 2వ రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రూ.2.26 కోట్ల షేర్ (రూ.4.55కోట్ల~ గ్రాస్) వసూలు చేసింది. 3వ రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రూ.3.58 కోట్ల షేర్ (రూ.6.70 కోట్ల గ్రాస్) వసూలు చేయగా... 4వ రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు - రూ.4.36 కోట్ల షేర్ (రూ.8.45 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఇక 5వ రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు - రూ.1.48CR షేర్ (రూ.2.80 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

Miss Shetty Mr Polishetty Movie 5 Days Official Box Office Collections

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మొత్తం వ్యాపారం(విలువ) రూ.12.50 కోట్లు కాగా...బ్రేక్ ఈవెన్ రూ.13.50 కోట్లతో బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోగా... సినిమా మొత్తం లాభం ...రూ.1.18కోట్ల లాభంతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X