Miss Shetty Mr Polishetty Collections: 6వ రోజు అంతకంటే తక్కువే.. అయినా అన్ని కోట్లు.. లాభం ఎంతంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో రూపొందిన వాటిలో కొన్ని మాత్రమే ఆరంభం నుంచే అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటాయి. అలాంటి వాటిలో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ఒకటి. యూత్‌ఫుల్ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ కూడా భారీగానే దక్కింది. దీంతో దీనికి కలెక్షన్లు పోటెత్తి బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తైంది. అయితే, ఆరో రోజు మాత్రం ఈ మూవీ బాగా డౌన్ అయింది. ఈ నేపథ్యంలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' బాక్సాఫీస్ రిపోర్టు మీరే చూడండి!
క్రేజీ కాంబోలో వచ్చిన మూవీ:నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమానే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. మహేశ్ బాబు పీ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో కనిపించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.

ఈ మూవీకి బిజినెస్ ఎంతంటే:యూత్‌ఫుల్ కాన్సెప్టుతో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం క్రేజీ కాన్సెప్టుతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని తెలిసింది. ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ రూ. 12.50 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. దీంతో ఈ చిత్రం 800 థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
6వ రోజు ఎంత వసూలైందంటే:అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందనే వచ్చింది. ఆరో రోజు వర్కింగ్ డే కావడంతో దీనికి కోటి రూపాయల కంటే తక్కువ షేర్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఆంధ్రాలో రూ. 30 లక్షలతో కలిపి.. ఆరో రోజు ఈ మూవీ రూ. 74 లక్షలు షేర్, రూ. 1.30 కోట్లు గ్రాస్ రాబట్టింది.

6 రోజులకూ కలిపి ఎంతంటే?:ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రానికి ఆరు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలోనే స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఆంధ్రాలో రూ. 3.15 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి 6 రోజుల్లో రూ. 8.90 కోట్లు షేర్, రూ. 15.70 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:6 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 8.90 కోట్లు షేర్ వసూలు చేసి సత్తా చాటుకున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.24 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.75 షేర్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.89 కోట్లు షేర్, రూ. 30.80 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఆరు రోజుల్లోనే దీనికి రూ. 15.89 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. హిటక స్టేటస్‌తో పాటు రూ. 2.39 కోట్లు లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











