Miss Shetty Mr Polishetty Collections: 9వ రోజు అన్ని లక్షలు.. నవీన్ నయా రికార్డు.. లాభం అన్ని కోట్లా
టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న యంగ్ హీరోలకు కొదవే లేదు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో క్రేజీ గాయ్ నవీన్ పోలిశెట్టి ఒకడు. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తోన్నాడు.
ఈ జోష్‌లోనే ఇటీవలే నవీన్ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో వచ్చాడు. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా దక్కింది. అయితే, క్రమంగా స్పందన తగ్గిపోతుంది. మరి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 9 రోజుల రిపోర్టును మీరే చూడండి!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి జోష్: నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా మహేశ్ బాబు పీ తీసిన సినిమానే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఈ క్రేజీ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో కనిపించారు.

ఈ మూవీకి బిజినెస్ ఎంతంటే: యూత్‌ఫుల్ కాన్సెప్టుతో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని తెలిసింది. ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ రూ. 12.50 కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. దీంతో ఈ చిత్రం 800 థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది.
9వ రోజు ఎంత వసూలైందంటే: వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న నవీన్ పోలిశెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందనే వచ్చింది. 9వ రోజు వర్కింగ్ డే అయినా ఇది బాగానే హోల్డ్ చేసింది. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఆంధ్రాలో రూ. 16 లక్షలతో కలిపి.. 9వ రోజు ఈ మూవీ రూ. 40 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ రాబట్టింది.
9 రోజులకూ కలిపి ఎంతంటే?: నవీన్ పోలిశెట్టి - అనుష్క శెట్టి జంటగా చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రానికి 9 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలోనే స్పందనే లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 5.68 కోట్లు, సీడెడ్‌లో రూ. 93 లక్షలు, ఆంధ్రాలో రూ. 3.73 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి 9 రోజుల్లో రూ. 10.34 కోట్లు షేర్, రూ. 18.25 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: 9 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 10.34 కోట్లు షేర్ వసూలు చేసి సత్తా చాటుకున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.42 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.40 షేర్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.16 కోట్లు షేర్, రూ. 35.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లోనే దీనికి రూ. 18.16 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.66 కోట్లు లాభాలు కూడా ఈ మూవీకి సొంతం అయ్యాయి.

అక్కడలా.. నయా రికార్డుతో: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి రెండో వారంలోనూ డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఇది 1.4 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లు షేర్ మార్కునూ దాటింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 35 కోట్లు గ్రాస్ మైలురాయిని చేరింది. దీంతో నవీన్ వరుసగా ఈ మార్కును రెండు సార్లు చేరిన యంగ్ హీరోగా రికార్డు సాధించాడు.


Click it and Unblock the Notifications











